4K Smart TV : ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సరికొత్తగా రకరకాల బ్రాండ్స్ వస్తూనే ఉన్నాయి . అలా ఇప్పుడు తాజాగా ACER అనే ఒక బ్రాండ్ నుంచి 4K ఆండ్రాయిడ్ టీవీలు విడుదల చేయడం జరిగింది. ఫ్రేమ్ లెస్ డిజైన్ , ఎగ్జిట్ టు ఎడ్జ్ డిస్ప్లే కలిగి ఉంటుంది ఈ స్మార్ట్ టీవీలో చిత్రం యొక్క నాణ్యత కూడా HDR 10+ , సూపర్ బ్రైట్నెస్ తో పాటు 4కె అప్ స్కేలింగ్ మరియు పిక్చర్ గొప్ప అనుభూతిని కలిగించేలా ఉంటుంది. ఇక ఈ స్మార్ట్ టీవీలో వన్ బిలియన్ కంటే ఎక్కువ రంగులను ప్రదర్శిస్తుందట. హై డెఫినేషన్ డిస్ ప్లే కలిగి ఉంటుంది.
ఇక అంతే కాకుండా ఇందులో ప్రతి మోడల్ కూడా 30 వాట్ సౌండ్ సిస్టం మరియు డాల్బీ ఆడియో సపోర్టుతో కలదు. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ -11 ఆపరేటింగ్ సిస్టంతో పని చేస్తుంది. ఇక ఇందులో ఆటోమేటిక్గా నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో గూగుల్ ప్లే, డిస్నీ హాట్ స్టార్ వంటి అనేక అప్లికేషన్లు ఈ స్మార్ట్ టీవీలో ఉంటాయి. ఇక ఈ స్మార్ట్ టీవీలో వాయిస్ ఎనేబుల్ రిమోట్ ని కలిగి ఉంటుంది. ఈ ACER స్మార్ట్ టీవీ 32 అంగుళాలు కలదు. ఇక స్టోరేజ్ పరంగా..1.5GB/8GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఇంచులను బట్టి స్టోరేజ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది
ఇక ఈ స్మార్ట్ టీవీ ధరల విషయానికి వస్తే.. 32 అంగుళాల కలిగిన ACER స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ధర మాత్రం రూ.14,999 రూపాయలకే లభిస్తుంది. ఇక 43 అంగుళాల స్మార్ట్ టీవీ ధర మాత్రం రూ.27,999 రూపాయలకి లభిస్తుంది. ఇక 50 అంగుళాల మోడల్ స్మార్ట్ టీవీ ధర మాత్రం రూ.32,999 రూపాయలకే లభిస్తుంది మరియు 55 అంగుళాల స్మార్ట్ టీవీ ధర మాత్రం రూ.37,999 ఈ ACER బ్రాండ్ నుంచి ఇలాంటి ధరలకు ఈ స్మార్ట్ టీవీలు లభిస్తున్నాయి ఇవి భారతదేశంలో ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ద్వారా కూడా అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరతో అదిరిపోయే ఫీచర్లతో ఏసర్ నుంచి వచ్చిన ఈ స్మార్ట్ టీవీలు మీ ఇంటికి సరికొత్త ఆకర్షణను అందిస్తాయని చెప్పడంలో సందేహం లేదు.