Nokia 4G Flip Phone : ప్రముఖ టెక్ దిగ్గజం నోకియా సరికొత్తగా ఫ్లిప్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం కస్టమర్లను ఆకర్షించే విధంగా నోకియా 2660 ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్లో ఇటీవలే ఆవిష్కరించింది . ఇకపోతే ఈ 4జి ఫీచర్ ఫోన్ పాత ఫ్లిప్ డిజైన్ మరియు కొత్త లేటెస్ట్ ఫీచర్ల సమాహారంగా అందించడం గమనార్హం. ముఖ్యంగా నోకియా 2660 ఫ్లిప్ తో పాటుగా నోకియా 8210 4జి క్లాసీ ఫోన్ ఇండియన్ మార్కెట్లోకి నోకియా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫోన్ కూడా పెద్ద డిస్ప్లే తో వస్తుందని.. మన్నికైనా మరియు సొగసైన డిజైన్ ను ఈ ఫోన్ కలిగి ఉంటుందని నోకియా స్పష్టం చేసింది. ఇకపోతే ఈ నోకియా 2660 ఫ్లిప్ యొక్క ధరలు, ఫీచర్స్ అన్నీ ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
నోకియా 260 ఫ్లిప్ ఫ్యూచర్ ఫోన్ భారతదేశంలోని అన్ని రిటైల్ అవుట్లెట్స్ తో పాటు ఈ కామర్స్ సైట్లల్లో కూడా లభ్యమవుతుంది. అంతేకాదు నోకియా.కామ్ సైట్లో కూడా మీరు కొనుగోలు చేయవచ్చు. కలర్స్ విషయానికి వస్తే నీలం , ఎరుపు , నలుపు రంగుల లో లభిస్తుంది. ఇక ధర విషయానికి వస్తే రూ.4,699 వద్ద మీరు కొనుగోలు చేయవచ్చు. ఫోన్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే 2.8 మైనర్ స్క్రీన్ ను జూమ్ చేసిన యూజర్ ఇంటర్ఫేస్ ను కలిగి ఉంటుంది. అంతేకాదు స్పష్టమైన పెద్ద రూపాన్ని డిస్ప్లే పైన అందిస్తోంది. ముఖ్యంగా 1.77 ఇంచ్ ఫ్రంట్ డిస్ప్లే ఇన్కమింగ్ కాల్స్ ను సులభంగా గుర్తించవచ్చు.
ముఖ్యంగా ఈ ఫోన్లో అందించిన పెద్ద బటన్స్ కారణంగా మెసేజ్ టైపింగ్ చేసేటప్పుడు ఎటువంటి తప్పులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ ఫోన్ నుంచీ చాలా సులభంగా మీరు టెక్స్ట్ మెసేజ్ పంపించవచ్చు. అంతేకాదు చాలా తేలికగా ఉండే ఈ ఫ్లిప్ ఫోన్ 1450 mah బ్యాటరీ కలిగి ఉంటుంది. ముఖ్యంగా అడ్జస్ట్ చేయగల వాల్యూమ్ సెట్టింగ్లతో స్పష్టమైన కాల్ నాణ్యతను పొందవచ్చు.. ఇక వినికిడిలో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. 0.3 ఎంపీ కెమెరాను కూడా నోకియా అందించింది. 4G డ్యూయల్ సిమ్ లకు సపోర్ట్ చేస్తుంది. 48 MB ర్యామ్ తో పాటు 128MB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా కలిగి ఉంటుంది.