Smart TV : సగం ధరకే 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ..త్వరపడండి..!!

Smart TV : ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారు. అందులోనూ తక్కువ ధరకే లభించే స్మార్ట్ ఫోన్లు ఉంటే చాలని చాలామంది అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తక్కువ ధరకే అతిపెద్ద టీవీలను.. అది కూడా బెస్ట్ ఫీచర్లతో అందివ్వడానికి సిద్ధంగా ఉంది ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్. ముఖ్యంగా ఈ టీవీ కొనుగోలు పై ఇతర ఆఫర్లను కూడా పొందే అవకాశం ఉంటుంది. మరొక విషయం ఏమిటంటే మీ దగ్గర క్రెడిట్ కార్డు లేకపోయినా ఈఎంఐ ఫెసిలిటీ తో ఈ టీవీలను సొంతం చేసుకోవచ్చు. ఇక అమెజాన్ అందిస్తున్న ఈ స్మార్ట్ టీవీ గురించి మనం ఒకసారి చదివి తెలుసుకుందాం. అమెజాన్ బేసిక్స్ 43 అంగుళాల ఫుల్ హెచ్డి స్మార్ట్ ఎల్ఈడి టీవీ పై 50% తగ్గింపు కూడా లభించనుంది.

నిజానికి ఈ టీవీ అసలు ధర మార్కెట్లో రూ.44, 000 ఉండగా మీరు కేవలం రూ. 20,999 రూపాయలకు మాత్రమే సొంతం చేసుకోవచ్చు. ఇక అంతేకాదు ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.4,500 వరకు తగ్గింపు లభిస్తుంది. ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ బరోడా , సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1500 వరకు తక్షణ తగ్గింపు కూడా లభిస్తూ ఉండడం గమనార్హం. క్రెడిట్ కార్డు యొక్క నో కాస్ట్ ఈఎంఐ విషయానికి వస్తే.. మీరు అమెజాన్ బేసిక్స్ 43 అంగుళాల టీవీని కొనుగోలు చేయాలనుకుంటే చాలా బ్యాంకులు ఈఎంఐ ఆఫర్ ను అందిస్తున్నాయి. అంటే వడ్డీ భారం లేకుండా మీరు అసలు ధరకే వాయిదాల రూపంలో చెల్లించి ఈ స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేసుకోవచ్చు.

43 inch Smart TV at half price
43 inch Smart TV at half price

ఇకపోతే నో కాస్ట్ ఈ ఎమ్ ఐ అందిస్తున్న బ్యాంకుల విషయాలకు వస్తే ఎస్బిఐ, అమెజాన్ పే, ఐసిఐసిఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆర్బిఎల్, యాక్సిస్ , కోటక్, ఇండస్ లాంటి చాలా బ్యాంకులు ఈ ఫెసిలిటీను అందుబాటులోకి తీసుకు రావడం జరిగింది మీరు ఒకవేళ క్రెడిట్ కార్డు ఈఎంఐ ఆప్షన్ పెట్టుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే 2 యేళ్ళ వరకు ఈఎంఐ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం మీరు కేవలం నెలకు ₹1000 చెల్లించి ఈ స్మార్ట్ టీవీ ని సొంతం చేసుకోవచ్చు. మీ దగ్గర క్రెడిట్ కార్డు లేకపోయినా కొనుగోలు చేయాలనుకుంటే అమెజాన్ పే లేటర్ ఫెసిలిటీ నీ కూడా అందివ్వడం జరిగింది. అంటే మీరు 9 నెలల వరకు ఈఎమ్ఐ పెట్టుకునే అవకాశం ఉంటుంది.ఇక ప్రతి నెల రూ.2,333 చెల్లించి ఈ స్మార్ట్ టీవీ ని సొంతం చేసుకోవచ్చు.