Motorola 2 Smart Phones : ప్రముఖ టెక్ దిగ్గజం మోటోరోలా తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా, మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ మోడల్స్ ను విడుదల చేసింది. ఇక ఈ సందర్భంగా మోటోరోలా రెండు స్మార్ట్ ఫోన్లను సెప్టెంబర్ 13న భారతదేశ మార్కెట్ లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇకపోతే ప్రస్తుతం ఈ కొత్త రెండు స్మార్ట్ ఫోన్లు ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ లో అమ్మకానికి రానున్నాయి. అయితే ఈ రెండు కూడా బిగ్ బిలియన్ డేస్ సేల్లో ఆఫర్ కింద రానున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్ ఫోన్లో ఫీచర్స్ , ధరలు అన్ని ఒకసారి చదివి తెలుసుకుందాం..
ముఖ్యంగా మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా స్మార్ట్ ఫోన్ చైనా మార్కెట్లో మోటో ఎక్స్ 30 ప్రో గా, మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్ ను మోటో ఎస్30 ప్రో గా విడుదల చేశారు. వీటి ఫీచర్స్ విషయానికి వస్తే మోటో ఎడ్జ్ 30 అల్ట్రా మోడల్ 6.67అంగుళాల , pOLED ఫుల్ హెచ్డి + ఎండ్ లెస్ ఎడ్జ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది.144 Hz రీఫ్రెష్ రేటుతో, శాండ్ బ్లాస్టెడ్ అల్యూమినియం ఫ్రేమ్, స్నాప్ డ్రాగన్ 8 +Gen 1 ప్రాసెసర్ తో వస్తుంది. ఇక మెమొరీ విషయానికి వస్తే.. 12GB ర్యామ్ , 256 జిబి స్టోరేజ్ మెమోరీని కలిగి ఉంటుంది. 200MP ప్రైమరీ కెమెరా, 50 MP అల్ట్రా వైడ్ కెమెరాతోపాటు 12 మెగాపిక్సల్ 2ఎక్స్ ఫోటో పోర్ట్రైట్ కెమెరా, 60 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను కూడా అమర్చబడి ఉంది.
4610 ఎంఏహెచ్ బ్యాటరీతో.125W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50W వైర్లెస్ చార్జింగ్ , రివర్స్ వైర్లెస్ చార్జింగ్ కూడా అందుబాటులో ఉన్నాయి.దీని ధర రూ.72,990. మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్ విషయానికి వస్తే..6.55 అంగుళాల ఎడ్జ్ లెస్, శాండ్ బ్లాస్టెడ్ అల్యూమినియం ఫ్రేమ్, స్నాప్ డ్రాగన్ 888 + 5G ప్రాసెసర్ తో పనిచేస్తుంది, 8GB ర్యామ్ , 50 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 13 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా మైక్రో విజన్ తో పాటు 32 మెగాపిక్సన్ సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంది.68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 4400ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది.