Health Tips : బట్టతల రావడానికి అసలు కారణాలు ఏంటో తెలుసా..??

Health Tips : సాధారణంగా మగవారిలో ఈ సమస్యలను మనం గమనిస్తూ ఉంటాము.. ఇక ఈ మధ్య కాలంలో మగవారు ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య బట్టతల.. వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులో ఉన్న వారికి కూడా ఈ సమస్య ఎదురవడం .. వయసు అయిపోయిన వారిలా కనిపించడం సహజం గా మారిపోయింది. బట్టతల రావడానికి గల కారణం ఏమిటి అనే విషయాలను కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సి ఉంటుంది..బట్టతల రావడానికి మనం తీసుకునే ఆహారమే అయినా కారణం అయి ఉండవచ్చు లేదా ఎక్స్ టర్నల్ ఫ్యాక్టర్స్ అయిన డస్ట్, పొల్యూషన్ ఇలా ఏదైనా కారణం కావచ్చు.

కానీ తాజా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చిన్న వయసు వారు కూడా జాగ్రత్త పడాల్సి ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇకపోతే ఈ సమస్య కు ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటే సమస్య రాకుండా నివారించవచ్చు అని వారు సలహా ఇస్తున్నారు.. బట్టతల సమస్య కారణంగా నుదిటి పై ఉండే జుట్టు కూడా పల్చబడి పోయి పూర్తిగా స్కాల్ఫ్ నునుపు గా మారిపోతుంది. 20 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండే వారిలో ఎక్కువగా ఈ సమస్య కనబడుతూ ఉండడం గమనార్హం.ముఖ్యంగా మనం తీసుకొనే కొన్ని ఆహారాల కారణంగా ఈ బట్టతల వస్తోంది అనేది కొంతమంది వాదన.. మనం ఏ ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి అనే విషయానికి వస్తే..

Do you know the real causes of baldness 
Do you know the real causes of baldness

జంక్ ఫుడ్ ,ఆయిల్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ వంటివి అస్సలు తినకూడదు.. ఇలా హై గ్లైసమిక్ ఫుడ్ ను అధికంగా తీసుకోవడం వల్ల బట్టతల సమస్య తలెత్తుతుంది.. యువత ఇలాంటి ఫుడ్ తీసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు కాబట్టి ఆ వయసులో ఉన్న వారికి ఇలాంటి సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం స్నాక్స్ రూపంలో ఉడకబెట్టిన గుడ్లు, చేపలు, తాజా పండ్లు వంటి వాటిని తీసుకోవచ్చు.జుట్టుకు కూడా ఎప్పటికప్పుడు తగినంత ఆయిల్ పెడుతూ.. గాఢత కలిగిన షాంపూతో తలస్నానం చేస్తూ ఉండడం ఇలాంటి పనులు చేయడం వలన బట్టతల వచ్చే అవకాశాన్ని పూర్తిగా దూరం చేయవచ్చు.