Health Tipsసాధారణంగా వయసు పైబడే కొద్దీ శరీరంలో మార్పుల కారణంగా ముఖంపై ముడతలు పడటం సర్వసాధారణం.. చిన్న వయసులో ఉన్నవారు కూడా ఈ ముడతల సమస్య తో ఇబ్బంది పడుతున్నారు. ఇక చర్మంపై ముడతలు రావడానికి గల ప్రధాన కారణాలేమిటి అనే విషయానికి వస్తే.. ఎండ, వాతావరణంలో కాలుష్యం, తీసుకునే ఆహారంలో పోషకాల లోపం, రాత్రిపూట ముఖం మీద ఉండే మేకప్ తొలగించక పోవడం, రోజుకు సరిపడా నీటిని తాగకపోవడం, తరచూ ఏదో ఒక మెడిసిన్ వాడుతూ ఉండడం, మద్యపానం, ధూమపానం, జీవనశైలిలో మార్పులు ఇలా చెప్పుకుంటూ
పోతే ఎన్నో కారణాల వల్ల చిన్న వయసులోనే ముఖం మీద ముడతలు వస్తున్నాయి..ఇకపోతే ఇప్పుడు చెప్పే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ముఖం మీద వచ్చే ఎలాంటి మడతలు అయినా సరే ఇట్లు దూరం అవుతాయి. ఇందుకోసం మీరు ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకోవాలి ఇక ఆ ఫేస్ ప్యాక్ కి కావాల్సిన పదార్థాలు ఏమిటి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు స్పూన్ల కలోంజి సీడ్స్..ఒక టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్ వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి
ఇప్పుడు ఈ పౌడర్‌లో ఒక టేబుల్ స్పూన్ తేనె, మూడు టేబుల్ స్పూన్ల బాదం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇకపోతే ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసే ముందు.. ముఖానికి ఆవిరి పట్టాలి.. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని పది హేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఆర బెట్టుకోవాలి.అనంతరం చల్లని నీటితో ఫేస్ వాష్ చేసుకుని మీ స్కిన్‌కి సూట్ అయ్యే మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి. ఇక ఈ ఫేస్ ప్యాక్ ను రెగ్యులర్ గా వారానికి రెండు సార్లు పాటించడం వల్ల ముఖం మీద వచ్చే ఎలాంటి ముడతలు అయినా సరే ఇట్టే దూరం అవుతాయి.