Beauty Tips : ఈ చిట్కాలతో నుదురుపై ట్యాన్ ఇట్టే పోవాల్సిందే..!

Beauty Tips : సాధారణంగా చాలా మందికి ముఖం, బాడీ తెల్లగా ఉంటుంది. కానీ, నుదురు మాత్రం ట్యాన్ వల్ల నల్లగా మారడంతో బాధపడుతుంటారు. దీనికి కారణం హార్మోనల్ ఇంబాలెన్స్, ఎండ, వేడి ప్రభావం, హైపర్ పిగ్మెంటేషన్, డీహైడ్రేషన్‌, మృత కణాలు పేరుకుపోవడం. దీని వల్ల నుదురు నల్లగా మారి, ఏ ప్రోడక్ట్ వాడినా ఫలితం లేకుండా ఉంటుంది. అవే కాక ఎక్కువగా చెమట పట్టినప్పుడు, పదే పదే తుడుచుకోవడం వల్ల రాపిడికి గురి అయి నుదురు నల్లగా మారుతుంది. ఇలా నల్లగా మారిన నుదురుని ఎలా తెల్లగా మార్చుకోవాలో తెలియక టెన్షన్ పడుతుంటారు. ఎన్ని కాస్మటిక్స్ వాడినా ఫలితం లేక బాధపడుతుంటారు. ఇలాంటి ఎన్నో సమస్య లకి ఆయుర్వేద చిట్కాలు ఎంతో బాగా ఉపయోగపడతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

దీని కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని,అందలో వన్ స్పూన్ కాఫీ పౌడర్‌,100ml నీరు పోసి బాగా కలపాలి. దానిని పది నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఆ తరువాత ఒక అరటి పండును తీసుకుని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టిన కాఫీ పౌడర్ వాటర్ లో అరటి పండు ముక్కలు, ఒక స్పూన్ కొబ్బరి నూనె,మూడు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ వేసుకుని,వాటన్నిటినీ మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ నీ ఏదైనా సాఫ్ట్ బ్రష్ తో కానీ, చేతితో నైనా నుదురు, మెడ భాగం పై బాగా మర్దన చేసుకొని,ఒక అర్ద గంటపాటు ఆరనివ్వాలి . అప్పుడే నుదురుపై బాగా ఇమురుతుంది. ఇది మొత్తం డ్రై అయిన తర్వాత గోరు వెచ్చని నీటితో,మెల్లగా మర్దన చేసినట్టు రుద్దుతూ శుభ్రం చేసుకోవాలి.

With these Beauty Tips you have to get a tan on your forehead..!
With these Beauty Tips you have to get a tan on your forehead..!

ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత పోర్స్ అన్ని ఓపెన్ అయి ఉంటాయి కాబట్టి, డస్ట్ చేరి మొటిమలు రాకుండా, పోర్స్ క్లోజ్ చేయడానికి ఏదైనా మాయిశ్చరైజర్ కానీ,సీరమ్‌ను కానీ అప్లై చేసుకోవాలి. ఇలా నలుపుదనం ఎక్కువగా వున్నవారు వారానికి రెండు సార్లు చేసుకోవాలి. సాధారణంగా ఉన్నవారు వారానికి ఒక సారి చేసుకుంటే గనుక నల్లగా మారిన నుదురు కేవలం కొద్ది రోజుల్లోనే తెల్లగా మరియు మృదువుగా, అందంగా మారుతుంది. ఏ చర్మ సమస్యలకైనా ఆహార అలవాట్లు, వాతావరణం ప్రభావం ఉంటుంది. కాబట్టి మంచి ఆహారం తీసుకోవాలి. ఎండలో వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ రాసుకుంటే ట్యాన్ ఏర్పడదు. ముఖ్యంగా రోజూ 4,5లీటర్ల నీరు త్రాగటం అలవాటు చేసుకుంటే చర్మం అందంగా, తాజాగా తయారవుతుంది.