Beauty Tips : ఈ రసంతో కళ్ళ కింద మచ్చలు దూరం అవుతాయా..?

Beauty Tips : నిద్రలేమి, అధిక ఒత్తిడి, శరీరంలో హార్మోనుల అసమతుల్యత, తీసుకొనే ఆహారంలో పోషకాల లోపం, అధికంగా ఆలోచించడం ఇలాంటి కారణాల వల్ల కూడా కంటికింద నల్లటి వలయాలు వచ్చే అవకాశం ఎక్కువ. ముఖం ఎంత అందంగా కనిపించినప్పటికీ కళ్ళ కింద ఉండే ఈ నల్ల మచ్చలు ముఖ అందాన్ని అందవిహీనంగా మారుస్తాయి. కాబట్టి కంటి కింద వచ్చిన నల్లటి వలయాలను దూరం చేసుకోవాలంటే ముందుగా సుఖనిద్రను అలవాటు చేసుకోవాలని వైద్యులు సైతం సలహా ఇస్తున్నారు. ఇప్పుడు చెప్పబోయే కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే చిన్నచిన్న మచ్చలను దూరం చేసుకోవచ్చు.

Will the spots under the eyes be removed with this juice
Will the spots under the eyes be removed with this juice

1. బంగాళాదుంప రసం : బంగాళదుంపను తీసుకొని..పైన తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. ఇప్పుడు కాటన్ క్లాత్ సహాయంతో ఈ మిశ్రమాన్ని ఆ క్లాత్ లో వేసి నీరు బయటకు వచ్చేవరకు గట్టిగా పిండాలి. ఇప్పుడు ఈ రసాన్ని ఐస్ ట్రేలో వేసి రెండు గంటలపాటు డీప్ ఫ్రిజ్లో ఉంచాలి. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ లా మారిన దీనిని తీసుకొని కళ్ళకింద వృత్తాకారంలో నెమ్మదిగా మసాజ్ చేయాలి. వారానికి రెండు సార్లు పాటించినట్లయితే కళ్ల కింద ఉండే నల్లమచ్చలు దూరమవుతాయి. మీకు సమయం ఉంటే రోజు చేసినా త్వరగా ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది.

2. కీరా రసం : కీర రసం లో కాటన్ బాల్ అద్ది.. కళ్ళ కింద అప్లై చేసి పది నిమిషాలు ఆగిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. అది కూడా కళ్లకు చల్లదనం ఇవ్వడమే కాకుండా మంచి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

3. టీ బ్యాగ్ : గ్రీన్ టీ ని కూడా కొద్దిగా కళ్ళ కింద అప్లై చేసినా నల్లటి వలయాలు దూరమవుతాయి.

వీటితోపాటు పోషకాహారం కలిగిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. శరీరానికి తగినన్ని నీళ్లు తప్పనిసరి. ఎండాకాలం కాబట్టి అత్యధిక నీరు శాతం కలిగిన తాజా పండ్లను తీసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం తో పాటు ఇలాంటి నల్లటి మచ్చలను కూడా దూరం చేసుకోవచ్చు.