Hair Tips : చిన్న వయస్సులో తెల్ల జుట్టు గుండె సమస్యకు కూడా కారణం కావచ్చు??

Hair Tips : ఈ మధ్యకాలంలో మారుతున్న జీవనశైలి కారణంగా చాలామంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. దీనిలో ఎక్కువగా గుండెపోటు లేదా గుండెకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. గుండె సమస్యలకు సంబంధించిన కొత్త అంశాన్ని పరిశోధకులు ఇప్పుడు కనుగొన్నారు. గుండె జబ్బులకు సంబంధించిన సమస్య తెల్ల జుట్టు..! వృద్ధాప్యంలో తెల్ల జుట్టు రావడం సహజం. కానీ కొంతమందికి చిన్నతనంలోనే తెల్ల జుట్టు వస్తుంది. దీని కారణంగా పురుషులలో ఎక్కువగా గుండె జబ్బులకు కారణమవుతుందని ఒక అధ్యయనం పేర్కొంది.

Hair Tips : గుండె జబ్బులు మరియు తెల్ల జుట్టు: పరిశోధన ఏమి చెబుతుంది?

యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ నిర్వహించిన ఒక అధ్యయనంలో పురుషులలో ఎక్కువగా బట్టతల మరియు చిన్నతనంలోనే తెల్ల జుట్టు రావడం ఊబకాయం కన్నా గుండె జబ్బుల ప్రమాదాన్ని ఎక్కువగా పెంచుతుందని కనుగొనడం జరిగింది. అంటే తెల్ల జుట్టు ఎక్కువగా ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది.

White hair at young age can also cause Heart Problem
White hair at young age can also cause Heart Problem

Heart Problem : పరిశోధన అంటే ఏమిటి?

తెల్ల జుట్టుకు మరియు గుండె జబ్బులకు సంబంధించిన పరిశోధన కోసం యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ అధ్యయనం నిర్వహించడం జరిగింది. దీనికోసం 42 నుండి 64 సంవత్సరాల వయసు గల వారిని పరిశోధన కోసం తీసుకోవడం జరిగింది. పురుషులలో గుండె సమస్యల లక్షణాలతో ఉన్న 80 శాతం మందికి తెల్ల జుట్టు ఎక్కువగా ఉంటుంది. అయితే తెల్ల జుట్టు ఉండటం వల్ల గుండె సమస్య ఉంటుందని కాదు.

ఇది మీ శరీరంలోని ఏదో ఒక అనారోగ్య సమస్య ఉందని సూచిస్తుంది. మీకు తెల్ల జుట్టు రావడానికి క్రింద పేర్కొన్న లక్షణాలు కనిపించినట్లయితే వైద్యులను సంప్రదించండి. అలసట, గొంతు లేదా దవడ నొప్పి, క్రమ రహిత హృదయ స్పందన, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అజీర్ణం, వికారం, కడుపు నొప్పి లేదా గుండెల్లో మంట ,పాదాలు మరియు మోకాలు వాపు రావడం, జుట్టు ఊడటం గుండె జబ్బులు కొన్నిసార్లు ఎలాంటి లక్షణాలను చూపించవు. ఒకవేళ మీకు లక్షణాలు కనిపించినట్లయితే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

చిన్న వయసులోనే తెల్ల జుట్టుకు కారణాలు : చిన్నతనంలోనే తెల్ల జుట్టు రావడానికి కారణాలు థైరాయిడ్ రుగ్మతలు, జన్యు శాస్త్రం, ఒత్తిడి, విటమిన్ బి12 లోపం, ధూమపానం వంటివి ఈ సమస్యకు కారణాలు. కావున జీవనశైలిని మంచిగా అలవర్చుకుంటే ఇటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

పరిష్కారం ఏమిటి?

1. వ్యాయామం చేయడం
2. టైం కి ఆహారం తీసుకోవడం
3. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం.
4. ధూమపానం మరియు మద్యపానం నుండి దూరంగా ఉండటం