Beauty Tips : సాధారణంగా అమ్మాయిలు అందంగా కనిపించాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏదైనా ఫంక్షన్లు, పార్టీలు, పెళ్లిళ్లు అంటే ఇక వారు అందంగా ఉండడానికి.. నలుగురిలో అందరి చూపు తమవైపే ఉండడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తారు అంటే వేలకు వేలు ఖర్చు కూడా చేస్తూ ఉంటారు. అంటే డబ్బులు ఖర్చు కాకుండా కేవలం ఇంట్లోనే సహజ ఉత్పత్తులతో మెరిసే ముఖాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. అది ఎలాగంటే సౌందర్య సంరక్షణలో బ్రౌన్ షుగర్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.. ఇక ఇది చర్మాన్ని మెరిసేలా చేయడంతో పాటు కొన్ని రకాల చర్మ సమస్యలను కూడా దూరం చేయడానికి సహాయపడుతుంది.
ఇక బ్రౌన్ షుగర్ తో ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయం ఒకసారి తెలుసుకుందాం.బ్రౌన్ షుగర్ లో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు చర్మంపై పేరుకుపోయిన టాక్సిన్లు తొలగించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. చర్మం నిగారింపు పెంచడానికి కూడా బ్రౌన్ షుగర్ చాలా చక్కగా పనిచేస్తుంది. ఇక ముఖం పై ఏర్పడిన నల్ల మచ్చలు దూరం చేయాలంటే కొబ్బరి నూనెలో కొద్దిగా వేసి.. రెండు కలిపి ముఖంపై స్క్రబ్ చేయాలి. వారానికి రెండు సార్లు పాటిస్తూ మచ్చ రహిత ముఖం మీ సొంతమవుతుంది.చర్మం యొక్క రక్తప్రసరణను మెరుగు పరచడంలో చాలా బాగా బాగా పనిచేస్తుంది .

ఎప్పుడైతే చర్మం మీద రక్త ప్రసరణ సరిగా లేదో అప్పుడు చర్మం పై ప్రభావం పడే అవకాశాలు ఎక్కువ . కాబట్టి బ్రౌన్ షుగర్ లో తేనె వేసి ఈ మిశ్రమాన్ని మీ ముఖం పై అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.కొంత మందికి వయస్సు చిన్నగా ఉన్నప్పుడే ముఖంపై ముడతలు రావడం మనం గమనిస్తూనే ఉంటాం. ఇక ఇలా అకాల ముడతలను తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. బ్రౌన్ షుగర్ లో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉండటం వల్ల కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలిపి ముఖంమీద అప్లై చేస్తే నెమ్మదిగా ముడతలు తొలగిపోతాయి.