Heart Attack : గుండె పోటు.. అన్ని వ్యాధులలో కెల్లా అత్యంత ప్రాణాంతకమైన వ్యాధి అని చెప్పవచ్చు.. ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటుతో మరణించిన వారిని మనం గమనిస్తూనే ఉన్నాం.. ఉదాహరణకు ఎంతో మంది సెలబ్రిటీలు సైతం ఈ గుండెపోటుతో అతి చిన్న వయసులోనే మరణించారు. ఇక అందుకే చాలామంది గుండెకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక వైద్యులు సైతం గుండెకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా రావడంతో ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి అని సూచిస్తూ ఉండటం గమనార్హం.. గుండెపోటు రావడానికి అధిక బ్లడ్ ప్రెజర్, ఒత్తిడి వంటి కారణాలు అని అధికంగా చెబుతూ ఉంటారు..ఈరోజు ప్రముఖ కార్డియాలజిస్టు మనతో కొన్ని విషయాలను పంచుకోవడం జరిగింది .. అవి ఏంటో తెలుసుకుందాం..
ముందుగా గుండెపోటు అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి.. గుండె రక్తాన్ని అన్ని భాగాలకు పంపిస్తుంది.. బ్రెయిన్ మొదలుకొని కిడ్నీ తో పాటు వివిధ శరీర భాగాలన్నింటికీ గుండె రక్తాన్ని సరఫరా చేస్తుంది.. ఎప్పుడైతే గుండె పనిచేయడం ఆగిపోతుందో.. అప్పుడు రక్తం సరఫరా అవయవాలకు వెళ్లకుండా ఆగిపోతుంది.. ఇక దీనినే హార్ట్ ఫెయిల్యూర్ లేదా గుండెపోటు అని అంటారు.ఇకపోతే గుండె పోటు రావడానికి గల లక్షణాలు ఏమిటి అంటే.. సాధారణంగా ఏదైనా పనులు చేస్తున్నప్పుడు లేదా శ్వాస తీసుకునే సమయంలో ఇబ్బందులు కలుగుతూ ఉండటం కాళ్లు వాయడం , నీరసం, ఎనర్జీ లేకపోవడం ఇలాంటివి కూడా కొన్ని ముఖ్య లక్షణాలు..ఎలాంటి టెస్ట్ మనం చేయించుకోవాలి అంటే..

ఈసీజీ, బ్లడ్ టెస్ట్ , ఎకోకార్డియోగ్రాఫ్ వంటివి చేయించుకోవాలి.. ఎకోకార్డియోగ్రాఫ్ అంటే ఇది ఒక అల్ట్రాసౌండ్ పరీక్ష. గుండె యొక్క ఫంక్షనల్ కెపాసిటీ ని చూపిస్తుంది. అందుకే హార్ట్ కు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ టెస్ట్ చేయించుకోవాలి..ఇక గుండెపోటు వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే.. వైద్యులు ఇచ్చిన మందులను సమయానికి క్రమం తప్పకుండా వేసుకోవాలి.. ప్రతిరోజు వ్యాయామం చేయడం, వాకింగ్ చేయడం వంటివి చేయాలి.. అలాగే తినే ఆహారాలలో ఉప్పు కూడా తగ్గించుకోవాలి.. వైద్యులు చెప్పిన సలహా మేరకు ఫ్లూయిడ్స్ అధికంగా తీసుకుంటూ ఎప్పటికప్పుడు వైద్యుడిని సంప్రదిస్తూ ఉండాలి..