Facial Glow : ఇంట్లోనే ఫేషియల్ గ్లో పొందాలి అంటే ఏం చేయాలి..?

Facial Glow : సాధారణంగా పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు, పార్టీలకు వెళ్ళాలి అంటే అమ్మాయిలు రెండు రోజుల ముందు నుంచి ముస్తాబు అవుతూ ఉంటారు. మినిమమ్ రెండు రోజుల ముందు నుంచి ప్రిపరేషన్ లేకపోతే ఈ పెళ్ళిళ్ళలో ఫంక్షన్లలో ప్రత్యేకంగా కనిపించలేరు అనేది అందరి భావన. అందుకే పార్లర్ కు వెళ్లడం లేదా హోం మేడ్ చిట్కాలను ఉపయోగించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక పార్లర్ కి వెళ్తే ఖచ్చితంగా వేలకువేలు ధార బోయాల్సి ఉంటుంది. ఇక మన చేతిలో డబ్బులు తక్కువగా ఉండి ఫేషియల్ గ్లో కావాలి అంటే కేవలం హోం మేడ్ చిట్కాలను ఉపయోగిస్తే సరిపోతుంది.. కాబట్టి చర్మాన్ని మరింత అందంగా తీర్చి దిద్దుకోవాలి అంటే కేవలం ఇంటి చిట్కాలను ఉపయోగిస్తే సరిపోతుంది అని చెబుతున్నారు కొంతమంది సౌందర్య నిపుణులు.. అయితే ఆ ఇంటి చిట్కాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

What does it mean to get a facial glow at home
What does it mean to get a facial glow at home

1. స్టీమింగ్ : ఫేషియల్ గ్లో పొందాలంటే ముందుగా మీ చర్మానికి స్టీమింగ్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్ గా స్టీమ్ అయినా ఉపయోగించవచ్చు లేదా ఒక టవల్ ను హాట్ వాటర్ లో ముంచి దానిని ముఖం మీద రెండు నిమిషాల పాటు ఒత్తుకున్నా సరిపోతుంది. అప్పుడు ముఖం మీద ఉన్న మూసుకుపోయిన రంధ్రాలు తెరుచుకోబడతాయి.

2. స్క్రబ్ : ముఖ్యంగా డ్రై స్కిన్ కలిగిన వారు స్క్రబ్ కోసం టమాటో ను ఉపయోగించవచ్చు. కొద్దిగా చక్కెర లో డిప్ చేసి టమోటో ముక్కలను ముఖం మీద వృత్తాకారంలో మసాజ్ చేయాలి. దీని వల్ల రంధ్రాలలో పేరుకుపోయిన దుమ్ము , ధూళి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. చర్మం పై ఉన్న నల్లటి ప్రాంతాలలో ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల ఆ ప్రాంతం లో గ్లో వచ్చే అవకాశం ఉంటుంది.

3. ఫేస్ ప్యాక్ : దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ రాగి పిండి, ఒక టేబుల్ స్పూన్ తేనె , డ్రై స్కిన్ వారు ఒక టేబుల్ స్పూన్ పచ్చి పాలు.. ఆయిల్ స్కిన్ వారు రోజ్ వాటర్ ను వేయాలి.దీనిని బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి.రెండు నిమిషాల పాటు మర్దనా చేయాలి.20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇక వారానికి 2 సార్లు చేస్తే చాలు.. ఫేషియల్ లాంటి గ్లో ఇంట్లోనే మీ సొంతం అవుతుంది.