Beauty Tips : వయసు పెరిగినా అందం గా ఉండాలి అంటే..?

Beauty Tips : వయసు పెరిగినా నిత్యయవ్వనంగా కనిపించేవారిలో మహేష్ బాబు ముందు వరుసలో ఉంటారు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ముఖ్యంగా మహేష్ బాబు వయసు నాలుగు పదుల వయసు దాటినా ఇప్పటికీ నిత్యయవ్వనంగా ఎలా మెయింటైన్ చేస్తున్నారు.. ఆయన ఇప్పటికీ ఇంత అందంగా ఉండటం వెనుక అసలు కారణం ఏమిటి అని అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే వయసు పెరిగినా మీరు కూడా యవ్వనంగా కనిపించాలంటే కొన్ని ఆహారపు అలవాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.ముఖ్యంగా యవ్వనంగా కనిపించాలంటే.. తీసుకోవాల్సిన ఆహార పదార్థాలలో నారింజ మొదటి స్థానంలో ఉంటుంది.

ఎందుకంటే ఇందులో లభించే విటమిన్ సి కారణం గా అందం రెట్టింపు అవుతుందని చెప్పవచ్చు. నారింజ తీసుకోవడం వల్ల అందంగా ఉండడంతో పాటు శరీరం డీహైడ్రేషన్ కాకుండా వుంటుంది.. ఇకపోతే ఆపిల్ రోజుకు ఒకటి తీసుకుంటే డాక్టర్ అవసరం రాదు అని ఎంతోమంది ఆరోగ్యనిపుణులు తెలియజేసిన విషయం తెలిసిందే. ఎందుకంటే ముఖ్యంగా ఆపిల్ లో మనకు విటమిన్ ఏ, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ లాంటి పోషకాలు లభిస్తాయి. ఇవి చర్మానికి రక్షణ అందిస్తాయి.92 శాతం నీరు అధికంగా ఉండే పుచ్చకాయలు కూడా చర్మానికి ఎంతగానో మేలు చేస్తాయి.

What does it mean to be beautiful as you age
What does it mean to be beautiful as you age

విటమిన్ సితో పాటు విటమిన్ ఎ , విటమిన్ బి1 కూడా లభించడం వల్ల చర్మానికి కాంతి వస్తుంది. వయసుతో పాటు చర్మం పై వచ్చే ముడతల్ని కూడా ఇది దూరం చేస్తుంది. ఇక సిట్రస్ జాతికి చెందిన నిమ్మకాయలు కూడా చర్మానికి ఎంతగానో ఉపయోగపడతాయి. మామిడి పండ్లు తీసుకోవడం వల్ల చర్మానికి కళ వస్తుంది అని చెప్పవచ్చు.ఎందుకంటే మామిడి పండ్లలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ తో పాటు ఫ్లేవనాయిడ్స్ కూడా ఉండటం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా వుంచుతాయి. కీర దోస తోపాటు దానిమ్మ వంటివి తీసుకోవడం వల్ల నిత్య యవ్వనంగా ఉండవచ్చు.