Digestion : జీర్ణక్రియ మెరుగుపడాలంటే ఏం చేయాలి.?

Digestion : మనం తిన్న ఆహారం సరిగా జీర్ణం అయినప్పుడే శరీరానికి కావలసిన అన్ని పోషకాలు లభిస్తాయి. ప్రస్తుతం గడుపుతున్న లైఫ్ స్టైల్ కారణంగా చాలామంది లో తిన్న ఆహారం సరిగా జీర్ణం కాక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమందికి తిన్న తర్వాత ఆహారం సరిగా జీర్ణం కాక అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. ఒక్కొక్కసారి తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వక పోవడానికి గల కారణాలు కూడా ఉన్నాయి.. అవి ఏమిటంటే సమయానికి భోజనం చేయకపోవడం.. ధూమపానం.. మద్యపానం.. బ్యాక్టీరియా.. ఇన్ఫెక్షన్.. ఫైబర్ కంటెంట్ అధికంగా లేని ఆహారాలు తీసుకోవడం వంటి వాటి వల్ల కూడా తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు.

ఇకపోతే కొంతమందిలో తిన్న వెంటనే జీర్ణం అయితే మరికొంత మందిలో ఆలస్యం అవుతుంది. ఇకపోతే మాంసాహారం ఎవరికైనా సరే తిన్న తర్వాత జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఎవరైతే జీర్ణక్రియ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు కొద్ది మోతాదులో ఆహారం తీసుకున్నా సరే త్వరగా జీర్ణం కాక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఇక అలాంటి వారు జీర్ణ శక్తిని పెంపొందించుకోవాలి అంటే కొన్ని రకాల చిట్కాలను ప్రయత్నించి తీరాల్సిందే. ముఖ్యంగా జీర్ణక్రియ రేటు పెరగాలి అంటే తిన్న తర్వాత తప్పకుండా పండ్లను తినాలి అని వైద్యులు సలహా ఇస్తున్నారు.


భోజనం చేసిన తర్వాత తాజా పండ్లను తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇక భోజనం చేసిన తర్వాత ఆపిల్ పండ్లను తింటే త్వరగా జీర్ణం అవుతుంది.. అలాగే జామ, దానిమ్మ, నారింజ వంటి పండ్లు తిన్నా సరే జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయకారిగా పనిచేస్తాయి. ప్రతి రోజు భోజనం ముగిసే ముందు చివరిలో ఒక కప్పు పెరుగు తింటే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అజీర్తి సమస్యతో బాధపడుతున్న వారు బొప్పాయి తింటే కూడా సమస్యలు తీరిపోతాయి అయితే భోజనం చేసిన గంట తర్వాత మాత్రమే బొప్పాయి తినాల్సి ఉంటుంది. అలాగే పుదీనా రసం కూడా భోజనానికి ముందు తాగడం నల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.