Hair Tips : జుట్టు ఊడిపోవడం ఈరోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య.. నేటి ఆధునిక జీవన విధానం, ఆహారపు అలవాట్లు, కాలుష్యం కారణంగా ఈ సమస్య వేధిస్తుంది. ఇందుకు ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. అలాగే తడి జుట్టు తో ఉన్నప్పుడు తలస్నానం చేశాక ఈ పొరపాట్లు చేయకండి..

తలస్నానం చేసేటప్పుడు నేరుగా షాంపూను తలపై రుద్దకూడదు. షాంపూను కాసిన్ని నీళ్లలో వేసి గిలకొట్టి ఆ నీటితో తలస్నానం చేయాలి. తలస్నానం చేసిన వెంటనే జుట్టు అరిపోవాలని హెయిర్ డ్రైయర్ అసలు ఉపయోగించ కూడదు. డ్రైయర్ వేడి జుట్టు కుదుళ్లను బలహీనం చేసి జుట్టు ఉడిపోయేలా చేస్తుంది. జుట్టు త్వరగా ఆరాలని తడి జుట్టు మీద గట్టిగా తుడవకూడదు. టవల్ పెట్టీ జుట్టు పై కొట్టకూడదు.. జుట్టు తడిగా ఉన్నప్పుడు బలహీనంగా ఉంటుంది. అలా చేస్తే జుట్టు త్వరగా ఊడిపోతుంది.
తలస్నానం చేసిన వెంటనే జుట్టు పై దువ్వెన పెట్టకూడదు. తడి తల పై దువ్వకూడదు. దువ్వితే జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. తడి తల పై కచ్చితంగా హెయిర్ కండీషనర్ అప్లై చేసుకోవాలి. ఇది జుట్టుకు తగినంత తేమను అందిస్తుంది. జుట్టు ఊడకుండా ఉండేందుకు సహాయపడుతుంది. సీరం కూడా జుట్టుకు పోషణ ను అందిస్తుంది. తలస్నానం చేసిన తర్వాత జుట్టును ముడి వేసుకోకూడదు. దాని వల్ల చుండ్రు వచ్చే అవకాశం ఉంది.