Weight Loss : తక్కువ సమయం లో సన్నగా అవ్వాలి అనుకోవడం తప్పు కాదు కానీ జాగ్రత్తలు పాటించకపోతే అంతే మరి !

Weight Loss : విల్ పవర్ ఉంటే ఫ్యాట్ నుంచి ఫిట్నెస్ కు మారొచ్చు.. ఇది ఇబ్బందికరం కాదు. కానీ దానిని మెయింటైన్ చేస్తేనే లాభం ఉంటుంది. కాకపోతే కాస్త సమయం పడుతుంది. లేదంటే ఇంకాస్త ఎక్కువ సమయం పట్టొచ్చు. రేపొద్దున కల్లా నేను బరువు తగ్గిపోవాలి అనుకోవడం మాత్రం పొరపాటే. బరువు తగ్గాలి అంటే శారీరక శ్రమను మించినది మరొకటి లేదు..

ఉదాహరణకి అనంత్ అంబానీ కేవలం 18 నెలల్లోనే 108 కేజీలు తగ్గాడు. ఇదొక వండర్ అని చెప్పాలి. కానీ ఆ తర్వాత డైట్ మెయింటైన్ చేయలేకపోవడంతో మళ్లీ లావుగా అయిపోయాడు.

బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా చాలా బొద్దుగా ఉండేది. ఆమె హీరోయిన్ కాదు కదా ఆమె పక్కన నటించడానికి కూడా పనికిరాదు అని చాలామంది అనుకున్నారు. ఆమె ఎంతో కష్టపడి బరువు తగ్గారు. ఫిట్నెస్ ట్రైనర్స్ చెప్పిన ఎక్సర్ సైజ్లుతో పాటు డైట్ మెయింటైన్ చేస్తూ ఏడాదిలో 40 కిలోలు తగ్గారు.

అర్జున్ కపూర్ కూడా జిమ్ లో హెవీ వర్కౌట్స్ చేస్తూ ఒక్క సంవత్సరంలోనే 70 కేజీలు తగ్గాడు. ఏడాది పాటు బరువు తగ్గించుకోవడానికి నరకం అనుభవించానని పలు ఇంటర్వ్యూలో సరదాగా చెప్పాడు. ఆలియా భట్ కూడా సినిమాల్లోకి రాకముందు చాలా బొద్దుగా ఉండేది. డైరెక్టర్ ఓ సినిమా ఆఫర్ ఇచ్చి మూడు నెలల్లో బరువు తగ్గకపోతే ఈ ఆఫర్ నీ చేజారి పోవడం ఖాయం అని చెప్పడంతో.. తన తండ్రి చెప్పిన కొన్ని మెలకువలతో కేవలం మూడు నెలల్లోనే 18 కేజీలు బరువు తగ్గింది ఆలియా భట్.

భూమి పటేకర్ కూడా నమ్మలేని రూపం నుంచి గ్లామరస్ హీరోయిన్ గా తయారైంది. ఈమె నచ్చింది తింటూ ఇంట్లోనే ఆరు నెలల పాటు జిమ్ చేసింది. ఇప్పుడు ఏ బాలీవుడ్ బ్యూటీ కి కూడా అందని స్థాయిలో ఈ బ్యూటీ ఉంది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే.. ఒక రాత్రికి రాత్రే బరువు తగ్గాలని అనుకోవడం పొరపాటు బరువు అనేది నిదానంగా తగ్గుతూ రావాలి. కీటో డైట్ కూడా ఎక్కువగా తీసుకోకూడదు. బరువు తగ్గాలి కదా అని అతిగా డైట్ చేయకూడదు. అది కూడా వికటిస్తుందని గుర్తుంచుకోండి. శారీరక శ్రమతోనే బరువు తగ్గించుకోవడం ఉత్తమం.