Maida: సాధారణంగా బియ్యం నుండి బియ్యప్పిండి.. జొన్నల నుండి జొన్నపిండి, రాగుల నుండి రాగిపిండి, సజ్జల నుండి సజ్జపిండి.. గోధుమలు నుండి గోధుమపిండి వస్తుందని అందరికీ తెలుసు. కానీ అన్ని వంటకాలలో విరివిగా ఉపయోగించే మైదాపిండి మాత్రం ఎలా వస్తుంది..? ఎక్కడ నుంచి వస్తుంది..? అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. అంతేకాదు ఈ మైదా పిండి ని ఉపయోగించి చేసే వంటలను ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా బేకరీలలో చేసే తీపి పదార్థాలను మొదలుకొని ప్రతి ఒక్కటి కూడా మైదా పిండి ని ఉపయోగించి తయారు చేస్తున్నారు. ఇకపోతే మైదాపిండి అనేది ఎలా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది అనేది కూడా తప్పకుండా తెలుసుకోవాలి.
మైదా పిండి ని ఎలా తయారు చేస్తారు అనే విషయానికి వస్తే మిల్లులో బాగా పాలిష్ చేయబడిన గోధుమల నుంచి వచ్చిన పిండి కి క్లోరిన్ గ్యాస్ , అజో డై కార్బోనమైడ్, బెంజాల్ పెరాక్సైడ్ అనే రసాయనాలను ఉపయోగించి తెల్లగా తయారు చేస్తారు. ముఖ్యంగా బెంజాల్ పెరాక్సైడ్ వాడకాన్ని చైనా మరియు ఐరోపా దేశాలలో నిషేధించబడింది. మైదాపిండిలో అల్లోక్సాన్ అనే విషపూరితమైన రసాయనం ఉంటుంది. ఇది నెమ్మదిగా శరీరంలోకి చేరి.. అధిక బరువు , ఇతర శరీర భాగాలకు కూడా నష్టం కలిగిస్తుంది.
ముట్టుకోవడానికి చాలా మెత్తగా .. చూడడానికి తెల్లగా ఉండే మైదాపిండిని ఎక్కువగా వంటలలో ఉపయోగించడమే కాదు తపాలా కార్యాలయాల్లో.. గోడలపై పోస్టర్లు అతికించడం వంటి వాటికి కూడా మైదాపిండి ని ఉపయోగిస్తారు. ముఖ్యంగా మైదా పిండి ని ఉపయోగించి కేకులు , కాజాలు, హల్వా, జిలేబి, పరోటా, రోటీ , అట్లు ఇలా మొదలైన వంటకాలను తయారు చేస్తారు. మైదాపిండిని అధికంగా తిన్నట్లయితే మధుమేహం, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉండడమే కాకుండా కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం కూడా ఉంది. క్రమంగా బరువు పెరగడం.. శరీర ఆకృతిలో మార్పు.. ఇలా రకరకాల సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మైదాపిండి కి దూరంగా ఉండటం మంచిది. మైదా పిండి తో తయారు చేసే వంటకాలను ఎక్కువగా ఇష్టపడే వారికి ఈ ఆర్టికల్ లో వాట్సాప్ ద్వారా షేర్ చేయండి.
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.