Weight loss : ఏ అమ్మాయి అయినా సరే తన అధిక బరువు తగ్గించుకుని నాజూగ్గా.. అందంగా కనిపించాలని అందుకు తగ్గట్టు డ్రెస్సులు కూడా వేసుకొని నలుగురిలో స్మార్ట్ గా కనిపించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇకపోతే ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునేటప్పుడు.. అందుకు తగ్గట్టు ఆహారంలో నియమ నిబంధనలు కూడా పాటించాలి. రెడ్ మీట్ ను తినడం మంచిది కాదు. రెడ్ మీట్ లో ప్రోటీన్స్ , విటమిన్ బీ 12 , ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా లభించినా.. ఈ రెడ్ మీట్ తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీటిలో కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉండటం
వల్ల అధిక బరువుతో పాటు ఒక్కోసారి గుండెజబ్బులు అలాగే క్యాన్సర్లకు కూడా దారితీయవచ్చు.మీట్ తినాలని అనుకునేవారు ఆర్గానిక్ పౌల్ట్రీ నుంచి తెచ్చుకున్న చికెన్ , సీఫుడ్స్ అలాగే మొక్కలు ఆధారిత ఆహారాలను కూడా మీ డైట్ లో చేర్చుకోవాలి. ఇక ప్రాసెస్డ్ ఫుడ్ తో పాటు జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. ఇక వీటికి బదులుగా ఓట్స్, సలాడ్స్, తాజాపండ్లు, బాదం, వాల్నట్ వంటివి తినవచ్చు. తీపి పానీయాలకు చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటిలో ఉండే చక్కెర స్థాయిలు మీ శరీర బరువును పెంచడానికి దోహదపడతాయి.

ఇక అంతే కాదు డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. కాబట్టి సాధ్యమైనంత వరకు పండ్ల ద్వారా తయారు చేసుకున్న చక్కెర రహిత జూస్ లను మాత్రమే తాగాలి.ఇక కాఫీ , టీలు తాగాలనుకున్నవారు కేవలం రోజుకు ఒకసారి అందులో చక్కెర లేకుండా కొద్దిగా బెల్లం వేసుకొని మాత్రమే తాగడం ఉత్తమమైన పద్ధతి. ఇక గోధుమరొట్టెలు, జొన్న రొట్టెలు తినవచ్చు. గోధుమరొట్టెలు రాత్రి సమయంలో తినేటట్టు అయితే కొద్దిగా పెరుగు అన్నం కూడా తినాలి లేకపోతే వేడి చేసే ప్రమాదం కూడా ఉంటుంది. మద్యపానం , ధూమపానం వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండాలి. ఇలా కొన్నింటిని మీరు పాటించడంవల్ల నాజూగ్గా , అందంగా కనిపిస్తారు.