Healthy Foods : గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ ఆహారాలు తప్పనిసరి..!!

మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం గుండె.. ఇది రక్తాన్ని వివిధ అవయవాలకు సరఫరా చేస్తుంది .. ఇక ఎప్పుడైతే గుండె పనితీరు దెబ్బతింటుందో.. అప్పుడు క్రమంగా రక్తం పంపిణీ సరిగా జరగక.. మిగతా అవయవాల పనితీరు కూడా మెల్ల బడుతుంది.. ఫలితంగా మనిషి మరణించే ప్రమాదం కూడా ఉంటుంది.. పదికాలాల పాటు పదిలంగా గుండె ఆరోగ్యాన్ని పెంపొందించు కోవాలి అంటే కొన్ని ఆహారాలను తప్పకుండా తీసుకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.. ఇక ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..

To be heart healthy these foods are a must
To be heart healthy these foods are a must

1. జీడిపప్పు : శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంపొందించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే పోషకాల కారణంగా గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా తగ్గిపోతుంది.. ముఖ్యంగా రక్తపోటును నియంత్రించడంలో జీడిపప్పు చాలా బాగా పనిచేస్తుంది. ఇక రోజు వారి ఆహారంలో గుప్పెడు జీడి పప్పు తినడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి.

2. చిలగడదుంప : పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉండే వీటిని తినడం వల్ల గుండెకు మంచిది. అంతేకాదు శీతాకాలంలో మాత్రమే లభించే వీటిని తినడం వల్ల ఎన్నో పోషకాలు కూడా లభించి మనిషి ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడతాయి.

3. బంగాళాదుంప : దుంప జాతికి చెందినటువంటి బంగాళాదుంపలను తినడం వల్ల రక్తహీనత సమస్య దూరమై గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

4. క్యారెట్: ఇందులో విటమిన్ ఏ తో పాటు విటమిన్ సి, ఫైబర్, కెరోటిన్ వంటి పోషకాలు లభిస్తాయి. ఇక క్యారెట్లు తినడం వల్ల రక్తనాళాలలో రక్తప్రసరణ పెరిగి గుండె ఆరోగ్యంగా ఉంటుంది..

ఇక వీటితో పాటు.. అరటిపండ్లు, గుమ్మడికాయ, బఠాణీలు, నారింజ , దోసకాయ , పుట్టగొడుగులు, ఎండుద్రాక్ష, వంకాయ వంటి వాటిని రోజు తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.. అయితే ఇవన్నీ రోజు తినడం కష్టం అనుకుంటే వారంలో రెండు సార్లు కచ్చితంగా తింటే గుండె ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఎక్కువ కాలం జీవిస్తారు.