Fruits: ఈ పండు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా.. ఎలా అంటారా..?

Fruits: సాధారణంగా ప్రకృతిలో లభించే ప్రతి పండు కూడా ఒక విధమైన ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. ఇకపోతే  ఇక్కడ చూపిస్తున్న అవకాడో కూడా ఆరోగ్యానికే కాదు ముఖారవిందాన్ని పెంచుకోవడానికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అవకాడో లో ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ లు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇక ఇవి సహజసిద్ధంగా చర్మ సౌందర్యాన్ని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ అవకాడో పండు లో ఉండే పోషకాల వల్ల ముఖం మృదువుగా తయారవుతుంది. డీప్ క్లెన్సర్ గా ఉపయోగపడి చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగించడానికి చాలా చక్కగా పనిచేస్తుంది.

This fruit is not only for health but also for beauty .. How do you say
This fruit is not only for health but also for beauty .. How do you say

ఇకపోతే ఎలా అప్లై చేయాలి అనే విషయానికి వస్తే.. అవకాడో పండును పేస్టులా చేసి.. ఒక టేబుల్ స్పూన్ తేనె , రెండు టేబుల్ స్పూన్ల పాలు వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మెడకు ముఖానికి ఈవెన్ గా అప్లై చేయాలి. ఒక 30 నిమిషాలు పూర్తిగా ఎండిపోయిన తరువాత చల్లని నీటితో శుభ్రంగా కడగాలి. ఈ ఫేస్ ప్యాక్ ను క్రమం తప్పకుండా ఒక వారం రోజులపాటు వాడినట్లయితే మీ చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది.

This fruit is not only for health but also for beauty .. How do you say
This fruit is not only for health but also for beauty .. How do you say

ఇక ఇదే కాదు మీరు మరొక ఫేస్ ప్యాక్ కూడా ఈ అవకాడో తో ట్రై చేయవచ్చు. అదెలాగంటే కొన్ని స్ట్రాబెర్రీలను తీసుకొని బాగా పేస్టులాగా చేసుకోవాలి. ఇక దీనికి కొద్దిగా ఎగ్ వైట్ ను కలిపి అవకాడో గుజ్జును కూడా కలపాలి. పూర్తిగా మిక్స్ చేసిన తర్వాత ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ వల్ల ముఖం మీద ఏర్పడిన ముడతలు దూరమవుతాయి. ఒక యాంటీ ఏజింగ్ ప్యాక్ గా ఇది మనకి ఉపయోగపడుతుంది.
ఇక పొడి చర్మం కలవారు ఈ అవకాడో గుజ్జుకు కొద్దిగా పెరుగు, ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి అప్లై చేసుకుంటే చర్మం తాజాగా నిగనిగలాడుతూ ఉంటుంది.