Categories: ExclusiveHealthNews

Eyebrows : కనుబొమ్మలను మరింత అందంగా తీర్చి దిద్దాలి అంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే..!!

Eyebrows : అమ్మాయిల అందం మొత్తం కనుబొమ్మల మీద ఆధారపడి ఉంటుంది. కనుబొమ్మలు ఎంత అందంగా ఉంటే ఆ అమ్మాయి కూడా అంతే అందంగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు బోల్డ్ కనుబొమ్మలను కోరుకుంటారు. ఇక కనుబొమ్మలు అందంగా ఆకర్షణీయంగా కనిపించాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మెంతులు:

మెంతులు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగు పరచడానికి చాలా బాగా సహాయపడుతాయి. అంతేకాదు జుట్టును ఆరోగ్యంగా , ఒత్తుగా పెరగడానికి కూడా ఉపయోగపడతాయి. అందుకే మెంతులను ఆహారంలో ఒక భాగం చేసుకోవడం వల్ల కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి.మెంతులను రాత్రంతా నానబెట్టి మెత్తటి పేస్ట్ లా చేసి కనుబొమ్మల పైన అప్లై చేస్తూ ఉంటే కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి.

2. కోడిగుడ్డు:

కనుబొమ్మల వెంట్రుకలు కెరటిన్ అనే ప్రోటీన్ తో తయారవుతాయి. అలాంటి ప్రోటీన్ కావాలి అంటే మనం గుడ్లు ఖచ్చితంగా తీసుకోవాలి. గుడ్డులోని పచ్చసొనలో బయోటిన్ పుష్కలంగా లభిస్తుంది కాబట్టి ఇది కనుబొమ్మలు  పెరగడానికి సహాయపడుతుంది.

3. పెట్రోలియం జెల్లీ:

ఈ పెట్రోలియం జెల్లీని రాత్రి పడుకునే ముందు కనుబొమ్మల పై అప్లై చేయడం వల్ల ఒత్తుగా, నల్లగా కనుబొమ్మలు పెరుగుతాయి.  ఇందులో ఉండే పెట్రోలేట్ అనే సమ్మేళనం తేమను ప్రవహించకుండా నిరోధిస్తుంది. ఫలితంగా కనుబొమ్మలు పొడవుగా, ఒత్తుగా పెరుగుతాయి.

4. కలబంద:

వెంట్రుకలు పెరగడానికి కలబంద బాగా సహాయపడుతుందని అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అలోవెరా జెల్ తీసుకొని కనుబొమ్మలకు అప్లై చేయడం వల్ల కనుబొమ్మలు చాలా ఒత్తు గా పెరుగుతాయి.

5. నిమ్మకాయ:

నిమ్మకాయ రసాన్ని కనుబొమ్మల పై రుద్ది 20 నిమిషాలు అలాగే ఉంచాలి. గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొబ్బరి నూనెను అప్లై చేయాలి ఇలా ప్రతిరోజూ పడుకునేముందు రాస్తే తప్పకుండా ఒత్తైన కనుబొమ్మలు మీ సొంతమవుతాయి.

6. విటమిన్ ఈ:

విటమిన్ ఈ కూడా మార్కెట్లో మనకు అందుబాటులో ఉంది. ఇక దీనిని రాత్రి పడుకునే ముందు చిన్నగా చేతిలోకి తీసుకొని ఈ విటమిన్ జెల్ ను కనుబొమ్మలకు అప్లై చేసి నిద్రపోవాలి. ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి ఇలా చేసినా కూడా కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

2 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

6 months ago

This website uses cookies.