ఈ పద్ధతులకు చర్మం అందంగా ఆరోగ్యంగా మారుతుంది..!!

ముఖ్యంగా మరికొద్ది రోజుల్లో వేసవికాలం రాబోతోంది కాబట్టి అందమైన చర్మాన్ని పొందడం ఎలా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు అలాంటి వారిలో మీరు కూడా ఒకరైతే.. చర్మాన్ని అందంగా మత్స్య రహితంగా మార్చుకోవడానికి కొన్ని చిట్కాలు హోమ్ రెమెడీస్ వారు కూడా తప్పకుండా తెలుసుకోవాలి. అంతేకాదు టాన్ లేని చర్మాన్ని పొందాలి అంటే కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చెప్పే కొన్ని పద్ధతులను పాటిస్తే తప్పకుండా అందమైన చర్మం మీ సొంతం అవుతుంది.

ఆవిరి పట్టడం : దీని వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది అలాగే ముఖం మీద పేరుకున్న మురికిని శుభ్రం చేయడంలో ఈ పద్ధతి చాలా ఎఫెక్టివ్ గా పని చేయడం గమనార్హం. చర్మ రంధ్రాలను తెరచుకొనేలా చేసి అందులో ఉన్న మలినాలను శుభ్రం చేస్తుంది. ఇక ఇందుకోసం మూలిక నూనె, నిమ్మరసం లేదా గంధంతో ఆవిరి పట్టుకోవడం వల్ల చర్మం నిగారింపును సంతరించుకుంటుంది కానీ ఎక్కువ సేపు ఆవిరి పట్టకూడదు.

These methods make the skin look pretty healthY
These methods make the skin look pretty healthY

ఎక్స్ పోలియేషన్ : చర్మాన్ని ఎక్స్ ఫోలియెట్ చేయడం వల్ల తాజాగా మృదువుగా మారుతుంది. అంతేకాకుండా చర్మంపై ఉండే మృత కణాలను తొలగించడానికి ఈ పద్ధతి ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఈ ఫేస్ మాస్క్ తయారు చేసుకోవడానికి మీకు 2 టేబుల్ స్పూన్ తేనె, అవకాడో మరియు కాస్త చక్కెర వంటివి అవసరం అవుతాయి. వీటన్నిటినీ మెత్తగా నూరి ఈ పదార్థాన్ని కలిపి ముఖం మీద రాసుకుని 20 నిమిషాల పాటు ఉండి చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

చర్మాన్ని టాన్ చేయండి : మీ చర్మంపై ఉండే రంధ్రాలను ఓపెన్ చేయడానికి ఇప్పుడే చర్మాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత చర్మంలోకి మురికి చేరకుండా ఉండడానికి.. రంధ్రాలు మూసివేయడానికి ఈ టానర్ చాలా ఉపయోగపడుతుంది. ఇక ఇలాంటి టానర్ ను మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అందుకు కావలసినవి రెండు స్పూన్ల గ్లిజరిన్, రెండు స్పూన్ల నీరు.. వీటన్నిటినీ బాగా కలిపి మిక్స్ చేసి ముఖానికి అప్లై చేస్తే సరిపోతుంది.