Hair Tips : నీళ్లలో మిక్స్ చేసి అప్లై చేస్తే చాలు.. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది..

Hair Tips శీతాకాలంలో జుట్టు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ కాలంలో జుట్టుకి కావాల్సిన తేమ అందదు.. ఫలితంగా జుట్టు రాలడం, ఊడిపోవడం ఎక్కువగా జరుగుతుంది.. అంతేకాకుండా కొందరికి ఏ సీజన్లో అయినా సరే కేశాలు ఎక్కువగా ఊడిపోతూ ఉంటాయి. అలాంటివారికి ఈ రెమిడి అద్భుతంగా పనిచేస్తుంది. ఈ చిట్కా ఎలా పనిచేస్తుంది.. అందుకోసం కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఈ చిట్కా కోసం ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో ఒక గ్లాసు నీటిని పోయాలి. ఈ నీరు మరిగాక అందులో రెండు చెంచాల కాఫీ పొడి వేసి మరిగించాలి. ఇందులో మూడు చెంచాల బియ్యం వేసి మరిగించాలి. ఇందులోనే 8 మందారం ఆకులు, ఒక మందారం పువ్వు, సన్నగా తరిగిన కలబంద ముక్కలు 10, లేదంటే మూడు చెంచాల కలబంద గుజ్జు, ఒక చెంచా వేపాకు పొడి లేదంటే 10 వేపాకు ఆకులు వేసి బాగా ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఆ తరువాత ఈ నీటిని ఒక గిన్నెలోకి వడపోసుకోవాలి.

అందులో ఒక చెంచా కొబ్బరి నూనె లేదంటే మీకు నచ్చిన బాదం నూనె, ఆలివ్ ఆయిల్, ఏదైనా నూనెను కలుపుకోవచ్చు.. ఇలా తయారు చేసుకున్న ఈ నీళ్లు 15 రోజులపాటు నిల్వ ఉంటాయి. ఈ నీళ్లను తలపై స్ప్రే చేసుకుని అరగంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తూ ఉంటే జుట్టు రాలడం తగ్గి కొత్తగా జుట్టు వస్తుంది. అలాగే పేనుకొరకుడు కూడా తగ్గుతుంది. బట్టతల ప్యాచెస్ ని కూడా తగ్గిస్తుంది ఈ మిశ్రమం. ఇంకా జుట్టు రాలడాన్ని తగ్గించి ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.