BEAUTY Foods : మేని ఛాయ మెరవాలి అంటే ఈ ఆహారాలు తప్పనిసరి..!!

BEAUTY Foods : అమ్మాయి అందంగా ఉండాలని కోరుకోవడం తో పాటు మేని ఛాయ కూడా మెరవాలి అని ఆలోచిస్తుంది.. ఇలా ఆలోచించడం లో తప్పు లేదు.. ఎందుకంటే అమ్మాయి అంటే అందం కాబట్టి అందంగా ఉండటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు.. అందుకే కొన్ని ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తే తప్పనిసరిగా ముఖ చర్మం అందంగా మారడమే కాకుండా మేని ఛాయ కూడా మెరిసిపోతుంది.. ముఖ్యంగా చర్మ సంరక్షణ .. రోజూ వారి దినచర్యను అనుసరించడమే కాకుండా ఆహారం పైన కూడా జాగ్రత్త వహించాలి.. ఇక మన రోజువారి డైట్ లో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అనే విషయం గురించి మనం ఒకసారి తెలుసుకుందాం.

These foods are a must have to glow your skin
These foods are a must have to glow your skin

అవకాడో : దీనిని బటర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తూ ఉంటారు.. ఇందులో మనకు విటమిన్ ఏ తో పాటు విటమిన్ సి కూడా పుష్కలంగా లభిస్తాయి.. ఇక వీటిలో లభించే కొవ్వులు, విటమిన్లు చర్మాన్ని రిపేర్ చేసి ముడతలు, మచ్చలు లేకుండా చర్మ సమస్యలను దూరం చేస్తాయి.. వారానికి ఒకసారైనా ఈ పండుతో తయారు చేసిన జ్యూస్ ను తాగడం వల్ల మేని ఛాయ మెరుగుపడుతుంది.

వాల్ నట్స్ : ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు వాల్ నట్స్ తినడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్ బి లభిస్తుంది.. వాల్ నట్స్ తినడం వల్ల చిన్న వయసులో వచ్చే చర్మ ముడతలను కూడా దూరం చేసుకోవచ్చు.

టమాటో : టమోటాలో విటమిన్ సీ ఉండడం వల్ల చర్మ సమస్యలను దూరం చేసుకోవడమే కాకుండా ముఖానికి అప్లై చేసుకోవడం చేతులు, కాళ్లకు అప్లై చేసినా కూడా ఎండ వల్ల వచ్చే నల్లటి మచ్చలు దూరం అవుతాయి.

డార్క్ చాక్లెట్ : డార్క్ చాక్లెట్ వల్ల అద్భుతమైన చర్మ ప్రయోజనాలు మనకు లభిస్తాయి. ఈ డార్క్ చాక్లెట్ వల్ల మనకు జింక్, ఐరన్, రాగి వంటి ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి.

ఇక వీటితో పాటు బాదం , గుడ్డు , పిస్తా, జీడిపప్పు , కివి పండు వంటివి తినడం వల్ల కూడా మేనిఛాయ మెరుగుపడటంతో పాటు ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలు లభిస్తాయి.