Thyroid : థైరాయిడ్ ను కంట్రోల్ చేసే సూపర్ ఫుడ్స్ ఇవే..!!

Thyroid : థైరాయిడ్.. ముఖ్యంగా మహిళల్లో అధికంగా వచ్చే ఈ సమస్య ప్రతి ఒక్కరికి సర్వసాధారణమై పోయింది . ఇక ఎనిమిది , తొమ్మిది సంవత్సరాల వయసున్న పిల్లలు కూడా హైపోథైరాయిడిజం లక్షణాలతో బాధపడుతున్నారు. శరీరంలో హార్మోన్లను ఉత్పత్తి చేసే గ్రంధి పనితీరు దెబ్బతింటే మాత్రం హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టి థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరును మెరుగు పరచాలి అంటే కొన్ని ఆహారాలు తీసుకోవాలి. అలాగే ప్రతిరోజూ వ్యాయామం చేయడం, సూపర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల థైరాయిడ్ గ్రంధి పనితీరు మెరుగుపడుతుంది.లైఫ్ స్టైల్ లో మార్పులు కారణంగా.. ఒక దశాబ్ద కాలంగా థైరాయిడ్ సమస్య ఎక్కువ అవుతోందని చెప్పవచ్చు.

ఇకపోతే థైరాయిడ్ సమస్య వచ్చినప్పుడు బరువు పెరగడం లేదా ఉన్నట్టుండి బరువు తగ్గడం , జుట్టు రాలిపోవడం, నెలసరి సక్రమంగా రాకపోవడం , గర్భం దాల్చడం లో ఇబ్బందులు, అలసట వంటి ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే థైరాయిడ్ గ్రంధి పని తీరును మెరుగు పరుచుకోవాలి. హైపర్ థైరాయిడిజం అనగా థైరాయిడ్ హార్మోన్లను ఎక్కువగా విడుదల చేస్తుంది T3, T4 హార్మోన్లు ఎక్కువగా విడుదలైనప్పుడు టీ ఎస్ హెచ్ తగ్గిపోతుంది. ఇక దాంతో జీవ క్రియల పనితీరు వేగవంతం అవుతుంది. ఇక బరువు తగ్గిపోవడం, అకారణంగా చెమటలు పట్టడం , గుండెదడ, పేగుల కదలిక ఎక్కువగా జరిగి విరేచనాలు అధికంగా అయ్యే అవకాశాలు ఉంటాయి.

These are the super foods that control the thyroid
These are the super foods that control the thyroid

హైపోథైరాయిడిజం అంటే హార్మోన్లు తక్కువగా విడుదలవుతాయి.. టి3 టి4 హార్మోన్లు తగ్గి టి.ఎస్.హెచ్ పెరిగిపోతుంది. ఈ సమస్య వంశపారంపర్యంగా కూడా రావచ్చు. లక్షణాల విషయానికి వస్తే జీవక్రియల పనితీరు దెబ్బతినడం, బరువు పెరగడం, మలబద్ధకం, గోర్లు విరిగిపోయినట్లు కనిపించడం, డిప్రెషన్ , గుండె కొట్టుకునే వేగం తగ్గడం , విపరీతమైన ఒళ్లు నొప్పులు, రక్తహీనత, నెలసరి సమయంలో అధిక రక్తస్రావం ఇ లాంటి మార్పులు కనిపిస్తాయి.ఇక పరిహారం విషయానికి వస్తే.. రాత్రంతా నానబెట్టిన కుంకుమ పువ్వు ను నిద్రలేవగానే తీసుకుంటే థైరాయిడ్ సమస్య ఉన్నవారికి అదుపులోకి వస్తుంది. ఇక అలాగే కొబ్బరి తిన్నా కూడా సూపర్ ఫుడ్ గా పనిచేస్తుంది. ఎండుకొబ్బరి రోగనిరోధకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది ఇక అలాగే ఉలవలు, అరటిపండు కూడా థైరాయిడ్ సమస్య అదుపులోకి తీసుకొని వస్తాయి