Health in Winter : శీతాకాలంలో చాలా వరకు ఆకుకూరలకు దూరంగా ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.. ఎందుకంటే వాతావరణంలో మార్పులు. తడి వాతావరణం కారణంగా ఫంగల్, వైరస్ల వృద్ధి ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా ఆకుకూరలు పైన బ్యాక్టీరియా అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఆకుకూరలను శుభ్రంగా కడిగిన తర్వాతనే తినాలి అని సూచిస్తున్నారు. ముఖ్యంగా మార్కెట్లో దొరికే కూరగాయలు , పండ్ల పై కచ్చితంగా పురుగుల మందు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని శుభ్రం చేసిన తర్వాతనే మనం తినడం మంచిది. ఇక పోతే మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ శీతాకాలంలో తినాల్సిన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
బీట్ రూట్ : ఇందులో విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా లభించి, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అంతేకాదు మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, కాపర్ ,మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇకపోతే విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ b9 ,క్యాల్షియం వంటివి కూడా పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ఈ శీతాకాలంలో ఇవన్నీ మనకు లభించాలంటే తప్పకుండా బీట్రూట్ తినాల్సిందే.

ముల్లంగి : ముల్లంగి తినడం వల్ల పచ్చకామర్ల నుంచి మనం తప్పించుకోవచ్చు. లివర్ అలాగే కడుపు కు సంబంధించి అన్ని సమస్యలు దూరం అవుతాయి. రక్తాన్ని కూడా శుభ్రం చేసే శక్తి ఈ ముల్లంగికి వుంది. ఇక ముల్లంగిలో విటమిన్ సి ,జింక్, ఫాస్ఫరస్ ,విటమిన్ బి కాంప్లెక్స్ వంటివి లభిస్తాయి. ఇక చర్మ సమస్యలు కూడా దూరం అవుతాయి.
క్యారెట్ : ప్రతి రోజూ క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల చర్మం కూడా నిగనిగలాడుతుంది. ముఖ్యంగా మగవారిలో క్యారెట్ జ్యూస్ రెగ్యులర్ గా తాగితే స్పెర్ము కౌంట్ పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఏ వల్ల దృష్టి లోపాలు కూడా దూరమవుతాయి. మహిళలు ప్రతి రోజూ ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల రొమ్ము క్యాన్సర్ కూడా దూరం అవుతుంది. చర్మం పై ముడతలు కూడా తగ్గిపోతాయి. గుండె సంబంధిత వ్యాధులు కూడా దూరమవుతాయి. నరాల బలహీనత తగ్గి జీర్ణసంబంధ సమస్యలు కూడా దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.