Be Careful : ఈ మధ్య కాలంలో చాలా మంది అధిక బరువుతో ఏ పని సవ్యంగా చేసుకోలేకపోతున్నారు. అధిక బరువు కారణంగా అనేక అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే ఈ అధిక బరువును తగ్గించుకోవడానికి చాలా మంది యోగా, డైట్, ఎక్సర్సైజ్ వంటివి చేస్తూ ఉన్నారు. అధిక బరువును తగ్గించుకోవాలి అంటే కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తినాలి అని వైద్యులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం..
మెంతికూర : మెంతికూర రుచికి చేదుగా అనిపించినా చిన్నపిల్లలు మొదలుకొని ముసలివారి వరకు ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని అందజేస్తుంది. ఈ మెంతికూర లో బీటా కెరోటిన్, ఆస్కార్బిక్ ఆమ్లం, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా లభించడం వల్ల ఊహాకాయం వచ్చే సమస్య అసలు ఉండదు. అంతేకాదు డయాబెటిస్ రావడానికి కూడా చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. శరీరంలో వచ్చే వాపు ను కూడా తగ్గించడానికి ఈ మెంతికూర చాలా బాగా పనిచేస్తుంది.

ముల్లంగి ఆకులు:క్యారెట్ అలాగే ముల్లంగి కూడా ఆరోగ్యానికి ప్రయోజనాలను అందజేస్తుంది. ఇకపోతే ముల్లంగి ఆకులు కూడా మన ఆరోగ్యానికి ప్రయోజనాలను కలిగిస్తాయి. ఈ ముల్లంగి ఆకుల లో తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది . కాబట్టి స్థూలకాయం వచ్చే సమస్య ఉండదు.
తోటకూర :శరీరంలోని ఇన్సులిన్ స్థాయిని తగ్గించే గొప్ప గుణం ఈ తోటకూరకు ఉంది. దీనిని తక్కువ తినడం తో ఎక్కువగా కడుపు నిండిన భావన కలుగుతుంది . కాబట్టి ఎక్కువగా తినే అవకాశం ఉండదు. ఫలితంగా అధిక బరువు వచ్చే అవకాశమే లేదు.
ఆవకూర:ఈ చలికాలంలో ఆవకూర ను ఎక్కువగా తినడం వల్ల విటమిన్ సి తోపాటు ఫైబర్ కూడా లభిస్తుంది. ఇక విటమిన్-సి వల్ల రోగనిరోధక శక్తి పెరిగితే ఫైబర్ వల్ల తినే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. కాబట్టి ఈ ఆవకూర వల్ల అధిక బరువు వచ్చే అవకాశం ఉండదు.