Hair Tips : జుట్టు ఆరోగ్యానికి ప్రోటీన్స్ చాలా అవసరమని అందరికి తెలిసిన విషయమే. కాబట్టి అందరూ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తింటూ వుంటారు. ఈ ప్రోటీన్ ఫుడ్ తినడం వలన ఉపయోగాలే కాక, ప్రోటీన్ ప్యాక్స్ కూడా జుట్టు సమస్యలు తొలగించి, జుట్టు ఆరోగ్యాంగా, దృఢంగా పెరిగేలా చేస్తాయి.ఇవన్నీ వారానికి ఒకసారి అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.ఆ ప్యాక్స్ జుట్టుకెలా వేసుకోవాలో చూద్దాం..
కొబ్బరి పాల హెయిర్ ప్యాక్ : కొబ్బరి పాలు రెండు కప్పులు తీసుకొని, అందులో అరటిపండు ముక్కలుగా చేసి, మిక్స్ చేసుకోవాలి.ఆ మిశ్రమాన్ని మాడుకు తగిలేలా మర్దన చేయాలి.అరగంట సేపు బాగా అరనించి, చల్లటి నీటితో స్నానం చేయాలి.. ఈ ప్యాక్‌లో ఫాస్పరస్ మరియు ప్రొటీన్లు అధికంగా ఉండటం వల్ల పొడిబారి మరియు దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేస్తుంది.
శీకాకాయ్ ప్రొటీన్ హెయిర్ ప్యాక్ : శీకాకాయ పొడిని 2 స్ఫూన్ లు మరియు శెనగ పిండి – 3 టేబుల్ స్ఫూన్ లు , గుడ్డు తీసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసి,బాగా అరిన తర్వాత గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. ఈ ప్రోటీన్ ప్యాక్ తో జుట్టు బలపడి రాలిపోకుండా చేస్తుంది.
గుడ్డు మరియు పెరుగు ప్రోటీన్ హెయిర్ ప్యాక్ : ఒక గుడ్డు తీసుకొని అందులో కప్పు పెరుగుతో కలపాలి.ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు బాగా మర్దనా చేసి అరగంట సేపు ఆరానివ్వాలి. తర్వాత జుట్టును చల్లటి నీటితో కడిగి,కండీషనర్ రాయాలి. వేడి స్టైలింగ్ నష్టం నుండి జుట్టును రక్షించడంలో ఇది చాలా సహాయపడుతుంది.
మెంతి హెయిర్ మాస్క్ : మెంతి గింజలను ఒక కప్పులో వేసి రాత్రంతా నానబెట్టాలి. దీనిని ఉదయాన్నే బాగా గ్రైండ్ చేసి తలకు, జుట్టుకు పట్టించి,జుట్టును ఒక క్లాత్ తో కవర్ చేయాలి. ఇది బాగా అరిన తర్వాత మైల్డ్ షాంపూ తో స్నానం చేయాలి. మెంతికూరలో ప్రోటీన్ మరియు లెసిథిన్ ఉంటాయి. ఇది హేర్ ఫోలికల్స్‌ను బలపరుస్తుంది మరియు చుండ్రు తగ్గడానికి సహాయపడుతుంది.
అవకాడో ప్రోటీన్ ప్యాక్.. అవకాడోను సగానికి కట్ చేసి బాగా మెత్తగా చేసి,దానికి గుడ్డు కలపాలి.. ఈ మిశ్రమాన్ని జుట్టుకుదుళ్ల కు అప్లై చేసి,వేళ్లతో బాగా మసాజ్ చేయాలి. ఈ ప్యాక్ సుమారు అరగంట సేపు అరిన తర్వాత మైల్డ్ షాంపూతో కడిగి, కండిషనర్ రాయాలి. ఇందులో ప్రోటీన్ మరియు ఇతర సమృద్ధిగా ఉండే పోషకాలతో నిండిన అవకాడో జుట్టు సమస్యలను నివారించి, జుట్టును బలంగా, దృఢంగా పెరిగేలా చేస్తుంది.