Health Benefits ; సజ్జల తో ఉపయోగాలు ఎన్నో..?

Health Benefits : సాధారణంగా మనకు తృణధాన్యాల వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి అని అందరికీ తెలిసిందే. బరువు తగ్గడానికి.. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి తృణధాన్యాలు చాలా చక్కగా సహాయపడతాయి. అంతేకాదు వీటిలో ఉండే కొన్ని అతి ముఖ్యమైన పోషకాల వల్ల దీర్ఘకాలిక వ్యాధులు కూడా అదుపులో వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తృణధాన్యాలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించడం గమనార్హం. ఇక అలాంటి వాటిలో సజ్జలు కూడా ఒకటి.. ప్రతిరోజు గుప్పెడు సజ్జలు తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

సజ్జలలో ఉండే కార్బోహైడ్రేట్స్ శరీరంలో నిదానంగా జీర్ణం అయి.. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. ఫలితంగా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉండదు. ఒకవేళ డయాబెటిస్ సమస్య ఉన్న వారు కూడా వీటిని తినడం వల్ల చక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది. సజ్జలలో ఉండే డైటరీ ఫైబర్ శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను దూరం చేయడంలో చక్కగా పనిచేస్తుంది. వీటిలో ఉండే పొటాషియం రక్తప్రవాహాన్ని పెంపొందించి అధికరక్తపోటు అదుపులో ఉండేలా చూడడమే కాకుండా గుండె సంబంధిత వ్యాధులను దూరం చేయడంలో చాలా చక్కగా సహాయపడుతుంది.అలసట, నీరసం, నిస్సత్తువ , ఏ పని చెయ్యలేక పోవడం

Health Benefits In Pearl millet
Health Benefits In Pearl millet

వంటి లక్షణాలతో బాధపడేవారు ప్రతిరోజూ గుప్పెడు సజ్జలు తినడం వల్ల ఇందులో ఉండే ఐరన్ సమృద్ధిగా లభించి రక్తహీనత సమస్యను నివారిస్తుంది. ఫలితంగా ఇలాంటి సమస్యలు ఏవీ దరిచేరవు. ఇక మలబద్దక సమస్యతో బాధపడుతున్న వారు కూడా సజ్జలు తినడం వల్ల కడుపులో మంట, అజీర్తి , గ్యాస్ వంటి మలబద్దక సమస్యలను దూరం చేసుకోవచ్చు. అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధులను దూరం చేయడంలో సజ్జలు చాలా బాగా సహాయపడుతాయి. అంతేకాదు సజ్జలలో ఉండే పాస్పరస్ ఎముకల బలానికి ఉపయోగపడుతుంది.. సజ్జల ను మొలకెత్తిచ్చి, రొట్టె రూపంలో లేదా చలివిడి రూపంలో తీసుకున్నా మంచి ప్రయోజనాలు కలుగుతాయి.