Nerve Weakness : మన శరీరంలో నరాల వ్యవస్థ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.. మన శరీరంలోని వివిధ అవయవాలకు గుండె నుండి రక్త సరఫరా చేయాలి అంటే ఈ నరాల నుంచి రక్తం ప్రవహిస్తుంది. ఒక్కోసారి నరాలు బలహీనపడి పోవటం.. నొప్పులు.. రక్తం గడ్డకట్టడం .. నరాల వాపు.. కళ్లు తిరిగి పడిపోవడం ఇలాంటి సమస్యలన్నీ అధికమవుతాయి. అయితే ఇలాంటి సమస్యను దూరం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఆ చిట్కాలేంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..ముఖ్యంగా ఈ నరాల సమస్యలు డయాబెటిస్, అధిక రక్తపోటు ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే
ఒక డ్రింక్ గురించి తెలుసుకొని ప్రతిరోజు దీన్ని తాగడం వల్ల ఇలాంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. ప్రతిరోజు వ్యాయామం చేయడం.. యోగా చేయడంతో పాటు మెగ్నీషియం అధికంగా లభించే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు చెప్పబోయే ఒక డ్రింక్ ను తయారు చేసుకొని తాగడం వల్ల నరాల వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఇకపోతే ఈ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..స్టవ్ వెలిగించి దాని పైన ఒక బాణలి పెట్టి అందులో ఒక గ్లాసు నీరు పోసి ఆ తర్వాత ఒక అంగుళం పొడవు దాల్చిన చెక్క వేయాలి.. తర్వాత నల్ల యాలకులు పగలగొట్టు వేసి ఆ తరువాత నాలుగు లవంగాలు వేసి బాగా మరిగించాలి.

సుమారుగా ఆరు, ఏడు నిమిషాల పాటు బాగా మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బెల్లం పొడిగా చేసి ఇందులో కలపాలి. ఆ నీరు చల్ల గారేలోపు బెల్లం కూడా కరిగిపోతుంది. డయాబెటిస్ ఉన్నవారు బెల్లం వేయకుండా తాగాలి. ఇక దీనిని ప్రతిరోజు ఉదయం తాగడం వల్ల నరాల వ్యవస్థ కు సంబంధించిన అన్ని సమస్యలు దూరమవుతాయి. ఈ డ్రింక్ తో పాటు మెగ్నీషియం అధికంగా లభించే ఆహార పదార్థాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది.