జీవితాన్ని కష్టంగా చూడడం మానేసి ఆటలా చూడు. అప్పుడు నువ్వు ఆటలో కలవడానికి ప్రయత్నిస్తావు..
నీ జ్ఞానం అనేది నువ్వు చేసే తప్పుల వల్ల పెరుగుతుందే కానీ తగ్గదు..
నువ్వు ఏమి తింటున్నావో.. ఏమి ఆలోచిస్తున్నావో..
ఏమి మాట్లాడుతున్నావో.. అనే ఈ మూడు విషయాలపై నీ సంతోషం అనేది ఎప్పుడు ఆధారపడి ఉంటుంది.
నీ భవిష్యత్తు నువ్వు ఎటువంటి ఆలోచనలపై కృషిచేసి అభివృద్ధి చెందాలి అనే ప్రక్రియ పై పూర్తిగా ఆధారపడి ఉంటుంది.
ఈ కాలం స్త్రీల ఉద్దేశంలో నీ దగ్గర డబ్బు సంపదలు లేకపోతే నీకు విలువ లేనట్లే..
డబ్బు ఒక్కటి ఉంటే నీ జీవితంలో 90 శాతం కష్టాలు తీరిపోతాయి ఇది సత్యం.
ఈ కాలంలో డబ్బు ఉన్నంతవరకు స్త్రీలు నీ వైపు మక్కువ చూపుతారు. నీ వెనుకబడి నిన్ను ఆరాధిస్తారు గౌరవిస్తారు. అలాగే అది లేనప్పుడు నువ్వు వారి నిజస్వరూపాన్ని కూడా చూడగలుగుతావు.
నీ మీద నువ్వు ప్రతిక్షణం శ్రద్ధపెట్టాలి దానివల్ల నువ్వు అనవసరమైన ఇతర విషయాలపై శ్రద్ధపెట్టకుండా ఉండవచ్చు.