Snoring Problem : ప్రతి ఒక్కరూ నిద్రించేటప్పుడు ఎంతో ప్రశాంతంగా పడుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే కొంత మంది గురక సమస్య వల్ల పక్క వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. గురక సమస్య కారణంగా పక్కన ఉన్న వారికి నిద్ర సరిగ్గా పట్టదు.. అయితే ఇలాంటి గురక సమస్య నుండి విముక్తి పొందేందుకు ఒక చిట్కా ఉన్నది.. గురక సమస్య తగ్గించడానికి ఇది ఒక చక్కటి వైద్యం గా పనిచేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే మీరు కూడా పక్క వాళ్ళ గురక వల్ల ఇబ్బంది పడుతుంటే వారికి ఈ ఆర్టికల్ను వాట్స్అప్ ద్వారా షేర్ చేయండి.ఇప్పుడు వాటి గురించి పూర్తి వివరాలు చూద్దాం.
మన వంటింట్లో దొరికేటువంటి యాలకలను మిక్సీలో వేసి బాగా పొడిగా చేసి ఆ తర్వాత ఆ పొడిని నిల్వచేసుకొని.. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కాస్త యాలకల పొడి కలుపుకొని తాగడం వల్ల ఈ గురక సమస్య నుండి దూరం చేసుకోవచ్చు.. ఇక ఈ విధంగా ప్రతి రోజూ తాగుతూ ఉంటే క్రమంగా గురక సమస్య అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఈ యాలకలు మన శరీరంలో ఉండే ఒత్తిడిని పోగొట్టి మైండ్ కి చాలా ప్రశాంతతను కలిగించి నిద్ర బాగా పట్టేలా చేస్తుంది.శ్వాసనాళాల్లో ఇబ్బందులను, దగ్గు, జలుబు వంటి సమస్యలు కూడా వచ్చినప్పుడు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
అయితే ఈ యాలకల పొడి ని తాగినప్పుడు.. వెల్లికిలా పడుకో కూడదట. కేవలం ఒక వైపు మాత్రమే తిరిగి పడుకోవాలి. ఇక అంతే కాకుండా యాలకల పొడి తో ఆవిరి పట్టుకున్నట్లు అయితే మన శ్వాసనాళాల్లో ఏదైనా అడ్డంకులు ఉన్నా.. తొలగిపోయి శ్వాస కూడా చాలా ఫ్రీగా అవుతుందట. ఇవన్నీ కేవలం ఇంటి చిట్కాలు వంటివని చెప్పవచ్చు. అయితే ఇవి నెలలో కనీసం మూడు సార్లు అయినా చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. అయితే గురక సమస్య తో బాధపడుతున్న వారు ఈ చిట్కాను ట్రై చేయవచ్చు.