Skin Care Tips : ఎండాకాలంలో చర్మ కాంతిని పెంచే ఫేస్ ప్యాక్స్ ఏంటో తెలుసా..?

ఎండాకాలంలో ఎక్కువగా శరీరం డీహైడ్రేషన్ కు గురి అవుతుంది. కాబట్టి చర్మం మీద మొటిమలు , మచ్చలు, పొడిబారిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా బయట సూర్యతాపం ధాటికి తట్టుకోలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి ఎక్కువగా చర్మంపై ట్యాన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఫలితంగా చర్మం అందవిహీనంగా.. నల్లగా.. కనిపిస్తుంది. మిగతా సీజన్ల తో పోల్చుకుంటే వేసవిలోనే చర్మ సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి.. అలాంటప్పుడు ఎండా కాలంలోనే ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకపోతే వేసవికాలంలో పుచ్చకాయతో ఫేస్ ప్యాక్ మరీ మంచిదని చెబుతున్నారు సౌందర్య నిపుణులు.

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తాయి.పుచ్చకాయలో ఎక్కువగా నీటి శాతం అధికంగా ఉంటుంది.. మరి ఇలాంటి పుచ్చకాయకు.. దోసకాయ తోడైతే ఇంకా నీటి శాతం మరింత రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఈ రెండూ కూడా శరీరానికే కాదు చర్మానికి కూడా మంచి ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. ఈ రెండింటిని మెత్తటి పేస్టులాగా చేసి గిన్నెలోకి రసం తీయాలి. ఈ రసాన్ని ముఖం, చేతులకు పట్టించాలి.. కొన్ని నిమిషాల తర్వాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

Skin Care Tips radiance in summer face packs
Skin Care Tips radiance in summer face packs

పుచ్చకాయ చర్మం మీద ఏర్పడిన ట్యాన్ ని తొలగించడం లో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. పెరుగు కూడా చర్మ సంరక్షణలో మెరుగ్గా పనిచేస్తుంది. కాబట్టి పుచ్చకాయ అలాగే పెరుగుతో కలిపి ఫేస్ ప్యాక్ చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. ఒక గిన్నెలో రెండు చెంచాల పెరుగు తీసుకొని దానికి మరో రెండు చెంచాల పుచ్చకాయ రసం వేసి బాగా మిక్స్ చేయాలి. ఇక ఈ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసిన .. ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం పైన ముడతలు తొలగిపోతాయి. పుచ్చకాయ రసంలో పాలు కలిపి ముఖానికి అప్లై చేసిన ముఖం తెల్లగా నిగ నిగ లాడుతూ ఉంటుంది.