Health : పిల్లల మెంటల్ హెల్త్ కోసం ఇలాంటి ట్రైనింగ్ ఇవ్వండి!!

Health : పిల్లలకి కాస్త సమయం దొరికితే చాలు అంతే. ఇల్లు పీకి పందిరేస్తారు. చెప్పిన మాట ఓ పట్టాన వినరు. అలా అని అన్నిసార్లు కోప్పడడం ఒకే చోట కూర్చోబెట్టడం సాధ్యం కాదు కదా. అందుకే చెప్పిన మాట వినేలా తీర్చిదిద్దాలంటే తల్లిదండ్రులు ఇలా చేయాలి. * “వాడు ఏది చెప్పినా వినడు, వాడికి నచ్చిందే తప్ప, వేరే పని ఏది చేయడు” అంటూ పదే పదే పేరెంట్స్ పిల్లల ముందే వారిలోని లక్షణాలను పదే పదే చెబుతుంటారు. ఒకవేళ నిజంగానే వారు అలా ప్రవర్తిస్తున్న, ఇలా చెబుతుండడం వలన అమ్మ తేలిగ్గానే తీసుకుంది లే అనుకుంటారు. పర్వాలేదు అన్న ధీమాకు వస్తుంటారు. అలా కాకుండా మా అబ్బాయి లేదా అమ్మాయి చెప్పిన మాటలు వింటారు. చెప్పిన వెంటనే త్వరగా అర్థం చేసుకొని పని పూర్తి చేస్తుంది.

అని చెబుతుంటే కొంత‌కాలానికి కచ్చితంగా వారిలో మార్పు క‌నిపిస్తుంది. * పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చాక హోం వర్క్ చేసుకోవడం, లేక టీవీ చూడటం వంటి వాటితోనే సమయం గడిచి పోతుందా? ఇలా కాకుండా వారికి నచ్చే విధంగా డ్రాయింగ్, కథల పుస్తకాలు, పాటలు వినడం వంటివి చేయిస్తే వారిలో మార్పులు కచ్చితంగా వస్తాయి. * పిల్లలు తల్లిదండ్రుల వద్ద విషయం గురించైనా స్వేచ్ఛగా చెప్పే స్వతంత్రతను కల్పించాలి. చైల్డ్ కేర్ నిపుణులు చెబుతున్న ప్రకారం సరైన సమయంలో కమ్యూనికేషన్ అనేది సరిగ్గా జరిగితే ఎటువంటి లోపాలున్న మీ అనుబంధం దెబ్బతినకుండా ఉంటుంది. అందుకే పిల్లలకు తల్లిదండ్రులు స్నేహితులు లాగా ఉండాలి. వారికి నచ్చే విషయాలను తెలుసుకోండి.
* పిల్లలను వంట గదిలోనికి రానివ్వండి. చిన్న చిన్న పనులను మీ పిల్లలకు అలవాటు చేయండి.

Similar training for children's mental health
Similar training for children’s mental health

కూరగాయలను శుభ్రం చేసి ఇవ్వమనడం, డైనింగ్ టేబుల్ తుడవడం వంటివి అలవాటు చేస్తే చాలు. ఒకవేళ వారు సరిగ్గా చేయలేకపోయినా విసుగు చెందకుండా వారికి నచ్చ చెప్పండి. ఇలా చెప్పడం వలన కొంత మార్పు వస్తుంది. * చెడు విషయాలను పక్కన పెట్టే దిశగా ఏం చేయాలో ఆలోచించండి అని చైల్డ్ కేర్ నిపుణులు చెబుతున్నారు. కానీ వీటికి ముందుగా చేయాల్సిందేమిటంటే… పిల్లలకు తమకంటూ సొంత ప్రవర్తన అనేది ఉండదు. తల్లిదండ్రులను చూస్తూ పెరుగుతారు. ప్రతి విషయాన్ని వారు మీ నుండే నేర్చుకుంటారు. వారు చెప్పింది చేయరు అంటే మీరు ఏ విషయానికి ఎలా ప్రవర్తిస్తారో వారు అలాగే ప్రవర్తిస్తారు కాబట్టి తల్లిదండ్రులు ముందుగా వారిలో ఉన్న లోపాలను సరిదిద్దుకుంటే పరిస్థితి అదుపులో ఉంటుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.