Hair Tips :నువ్వుల దీపారాధనకు ఉపయోగిస్తాం.. అలాగే వంటల్లో కూడా ఈ నూనెను వాడుతుంటాం.. చర్మ సంరక్షణలో కూడా నువ్వుల నూనె అద్భుతంగా పనిచేస్తుంది. అయితే జుట్టుకు మాత్రం ఈ నూనె గ్రేట్ గా పనిచేస్తుంది.. నువ్వుల నూనెలో ఏ ఏ పదార్థాలు కలిపితే జుట్టు షైనీగా మారుతుందో.. తెల్ల జుట్టుకి నువ్వుల నూనె ఏ విధంగా పనికొస్తుందో.. జుట్టు ఒత్తుగా పెరగాలంటే నువ్వుల నూనెను ఏ విధంగా రాసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

నువ్వుల నూనెను లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కుదుళ్లను ఆరోగ్యంగా, తేమగా ఉంచుతాయి. నువ్వుల నూనెలో నిమ్మరసం లేదా అలోవెరా జెల్ కలిపి రాత్రి జుట్టుకు పట్టించి ఉదయాన్నే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.
చుండ్రు ఉన్నవాళ్ళు నువ్వుల నూనెలో కొబ్బరినూనె కలిపి చేసి జుట్టుకు మసాజ్ చేయాలి. ఇలా చేస్తే తలలో ఉన్న చుండ్రు త్వరగా తగ్గుతుంది..
నువ్వుల నూనె జుట్టుకు సహజ సిద్ధమైన మెరుపు సంతరించుకుంటంది. నువ్వుల నూనెలో గ్లిజరిన్ కలిపి జుట్టుకు పట్టించి అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.. ఇలా చేస్తే మీ జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తుంది.
తెల్ల జుట్టు సమస్య ఉన్నవారు నువ్వుల నూనెను ప్రతి రెండు లేదా మూడు రోజులకు ఒకసారి తలకు పట్టించాలి. నువ్వుల నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మీ తెల్లజుట్టును నల్లగా మారటానికి సహాయపడతాయి.