సాధారణంగా స్క్రబ్స్ వల్ల చర్మంపై పేరుకుపోయిన దుమ్ము , ధూళితో పాటు మృత కణాలను కూడా తొలగించుకోవచ్చు. ఇకపోతే చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగించాలి అంటే ఎలాంటి స్క్రబ్ లు ఉపయోగిస్తే సరిపోతుంది అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం..
1. కాఫీ పొడి – చక్కెరచక్కెర : ఈ రెండింటితో తయారు చేసిన ఫేస్ స్క్రబ్ చర్మానికి ఎంతో మేలు కలిగిస్తుంది.. రెండు టేబుల్ స్పూన్ల కాఫీపొడిలో ఆఫ్ టేబుల్ స్పూన్ చక్కెర వేసి బాగా కలపాలి. దీనిని ముఖంపై అప్లై చేసి వృత్తాకారంలో మసాజ్ చేయాలి. ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత చల్లని నీటితో శుభ్రంగా కడిగి వేయాలి. స్క్రబ్ తో ముఖంపై పేరుకున్న మురికిని తొలగించి చర్మం మెరిసేలా చేసుకోవచ్చు..

2. ముల్తానీ మట్టి – యాస్పిరిన్ టాబ్లెట్ : కొద్దిగా ముల్తానీమట్టి తీసుకుని అందులో ఒక యాస్పిరిన్ టాబ్లెట్ వేయాలి.. పేస్ట్ లా కలిపి ముఖానికి అప్లై చేసి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. జిడ్డు చర్మం కలవారికి ముల్తాని మట్టి చాలా చక్కగా పని చేస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఎవరైతే జిడ్డు చర్మంతో బాధపడుతున్నారో వారు అలాంటి వారు ఈ స్క్రబ్ ఒకసారి ఉపయోగించండి.
3. ఆరెంజ్ పీల్ పౌడర్- పాలు : విటమిన్ సి ఆరెంజ్ లో చాలా చక్కగా లభిస్తుంది.. కాబట్టి చర్మాన్ని ఆరోగ్యంగా.. కాంతివంతంగా ఉంచుతుంది.. ఇందుకోసం మీరు ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకొని అందులో పాలు కలిపి.. ముఖానికి అప్లై చేసి చేసి పది నిమిషాల తర్వాత నీటితో శుభ్రంగా కడుక్కోవాలి.
4. బియ్యం పిండి – మొక్కజొన్న పిండి : దీనిని ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున తీసుకొని బాగా మిక్స్ చేయాలి.. కొద్దిగా పాలు లేదా తేనె కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఇక అయిదు నిమిషాలు ఆగిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం తాజాగా కోమలంగా కనిపిస్తుంది.