Sarpagandha Plant : మొక్కలే మనకు ప్రాణవాయువు ని అందిస్తాయి.. నిత్యం మనం చూసే మొక్కలలో కొన్ని మొక్కల ఔషధ గుణాలు ఉంటాయి. అటువంటి మొక్కలలో సర్పగంధ కూడా ఒకటి.. ఈ మొక్కనే స్నేక్ రూట్ అని కూడా అంటారు.. ఈ చెట్టుకు తెలుపు, గులాబీ రెండు రంగులు కలిసిన పూలు పూస్తాయి.. ఈ మొక్కలో అదో ప్రత్యేకత అయితే.. ఆయుర్వేద వైద్యంలో మరో ప్రత్యేక స్థానాన్ని కల్పించారు..!
స్నేక్ రూట్ లో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇంకా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. సర్పగంధ మొక్క వేర్లను నమిలిన ఒత్తిడి తగ్గుతుంది. సర్పగంధ మొక్క వేర్లను సేకరించి దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక గ్లాసు పాలలో వేసి కలిపి తాగితే నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్య ఉండదు.సర్పగంధ పొడిని బహిష్టు సమయంలో తీసుకుంటే ఆ సమయంలో వచ్చే నొప్పులను తగ్గిస్తుంది.

వికారం, నీరసం, నిస్సత్తువ ను తొలగిస్తుంది. ఈ పొడిని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోకి హానికర బ్యాక్టీరియా ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. ఈ మొక్కలో అధిక రక్తపోటును తగ్గించే గుణాలు ఉన్నాయి. సర్పగంధ పొడిని ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే బ్లడ్ ప్రెజర్ కు చెక్ పెట్టవచ్చు. గజ్జి, తామర, దురద వంటి చర్మ సంబంధిత సమస్యలకు ఈ పొడి తో చెక్ పెట్టవచ్చు.