Sapota Tips : సీజనల్ గా దొరికే ఈ సపోటా పండ్లు ఎన్నో పోషకాలు మనకు లభిస్తాయి.. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు శరీర ఆరోగ్యానికే కాదు చర్మ ఆరోగ్యానికి కూడా చాలా చక్కగా పనిచేస్తాయి.. ఇక తాజాగా వెలువడిన ఒక అధ్యయనం ప్రకారం సపోటా పండు లో లభించే పోషకాలు ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగపడతాయి అని ఋజువైంది.. చర్మం మీద వచ్చే అన్ని సమస్యలను దూరం చేసి.. జుట్టు పెరగడానికి కూడా చాలా చక్కగా సహాయపడతాయి..
వైద్యులు కూడా ఈ సపోటా పండ్లను ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా తీసుకోవాలని సలహా ఇస్తున్నారు..తినడానికి చక్కటి రుచి.. మధురమైన తీపితో ఈ పండు చాలా అద్భుతంగా ఉంటుంది.. ముఖ్యంగా ఈ పండును అలాగే తినవచ్చు లేదా జ్యూస్ రూపంలో అయినా సేవించవచ్చు.. సపోటా పండు లో మనకు అనామ్లజనకాలు, ఐరన్ , విటమిన్స్ వంటివి లభిస్తాయి.. అలాగే యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ వైరల్ లక్షణాలు కూడా ఉండటం వల్ల చర్మం , జుట్టు సమస్యలను దూరం చేస్తాయి.. ఇకపోతే ఈ పండు నుండి తీసిన గుజ్జులో పెరుగు , నిమ్మరసం వేసి బాగా కలపాలి..

ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి కొద్ది సేపు ఉంచి తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి .. ఇలా చేయడం వల్ల ముఖం మీద మొటిమలు.. మొటిమల కారణంగా వచ్చే మచ్చలు కూడా దూరమవుతాయి.ఇక అంతే కాదు ఒక కప్పులో పండిన సపోటా పండు గుజ్జును తీసుకుని, అందులో కొద్దిగా బేకింగ్ సోడా వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి నట్లయితే చర్మం మీద ఉండే కణాలు కూడా తొలగిపోతాయి. జుట్టు బాగా.. మృదువుగా రావాలి అంటే.. సపోటా విత్తనాల నుంచి తీసిన నూనెను జుట్టుకు పట్టించి నట్లయితే చుండ్రు సమస్యలు దూరం అవడం తో పాటు జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.