Saffron Oil : ఇటీవల కాలంలో చాలామంది కుంకుమాది తైలం ను ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు.. అయితే మరికొంతమంది లో తలెత్తే కొన్ని సందేహాలు ఏమిటంటే అందమైన చర్మం కోసం కుంకుమాది తైలం ఎలా పనిచేస్తుంది అని.. ఇక ముఖ్యంగా చర్మం అందంగా మెరవాలి అంటే అందుకు తగిన వాటర్ అలాగే సహజ నూనెలు అవసరం అవుతాయి.. ఇక చర్మం సాధారణంగా చాలా ఎక్కువ నీటిని ప్రొడ్యూస్ చేయలేదు.. అందుకే మనం మాయిశ్చరైజర్ లను ఎక్కువగా ఉపయోగిస్తాము..ఇకపోతే ఫేస్ వాష్ చేసుకునే టప్పుడు ఉపయోగించే సబ్బుల వల్ల చర్మం మీద ఉండే సహజ నూనెలను కోల్పోవడం సహజం.
ఇక ఫలితంగా మొటిమలు , పోర్స్ వంటివి ఎక్కువగా వస్తాయి. అయితే ఎటువంటి ఫేస్ వాష్ జెల్ లు ఉపయోగించడం ఏ మాత్రం మంచిది కాదు.. ఫేస్ వాష్ చేసిన తర్వాత ఫేషియల్ ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల కొంతవరకు ఉపయోగం అయితే ఉంటుంది. ముఖ్యంగా కుంకుమాది ఆయిల్ ను ఫేస్ పై అప్లై చేయడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయి.. కుంకుమాది తైలం ఎక్కువగా ఆయుర్వేద చికిత్సలో ఉపయోగిస్తారు.దీని వల్ల చర్మం చాలా అందంగా తయారవుతుంది. క్లెన్సర్ గా, మాయిశ్చరైజర్ గా, ఫేషియల్ టోనర్ గా కూడా పనిచేస్తుంది.కుంకుమాది తైలం ని ముఖానికి అప్లై చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయానికి వస్తే..

ముఖానికి సహజ నూనెలను అందించడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. పొల్యూషన్ ని పెంచడం లో..చర్మ కణాలను రిపేర్ చేయడంలో సహాయపడుతుంది. ఇక ఇది స్కిన్ రేడియంట్ ను నేచురల్ గా పెంచడానికి సహాయపడుతుంది.. దీనిని ఉపయోగించడం వల్ల మీ స్కిన్ ప్రకాశవంతంగా మెరిసిపోతుంది. ముఖానికి ఉపయోగించే డైలీ రొటీన్ లో కుంకుమాది తైలం ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఇక రెగ్యులర్ గా మసాజ్ స్కిన్ సెల్స్ ను రీ జనరేట్ చేయడంలో కూడా ఈ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది. మృతకణాలు, యాంటీ ఏజింగ్ లక్షణాలను కూడా దూరం చేయడంలో ఇది చాలా బాగా పని చేయడం గమనార్హం.