Health Tips : సాధారణంగా వయస్సు ని బట్టి శరీరంలో జరిగే హార్మోన్ల అసమతుల్యత కారణంగా ముఖం మీద మచ్చలు, మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది . అంతేకాదు కొద్ది రోజుల్లో ఎండాకాలం రాబోతోంది కాబట్టి వచ్చే ట్యాన్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది..దీంతో పాటు ముడతలు , చర్మం ఎర్రగా మారడం వంటి సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు మీరు మొటిమలను, మచ్చలను దూరం చేసుకోవాలి అంటే కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.. అయితే అలాంటి ఎఫెక్టివ్ ఫేస్ ప్యాక్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
ముందుగా మీరు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఫుల్లర్స్ ఎర్త్ ( ముల్తానీ మిట్టి), తొక్క తీసి బంగాళదుంప నుంచి తీసిన రసం 2 టేబుల్ స్పూన్లు, మెత్తగా నూరిన జాజికాయ పొడి ఒక టేబుల్ స్పూన్.. ఒక టేబుల్ స్పూన్ పెరుగు, చిటికెడు పసుపు, అర టేబుల్ స్పూన్ తేనె ఇలా అన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సమానంగా ముఖం అంతటా అలాగే మెడకు అప్లై చేయాలి. ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు ఆగి.. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.తర్వాత మీ చర్మతత్వానికి బట్టి సూట్ అయ్యే మాయిశ్చరైజర్ ఉపయోగించాల్సి ఉంటుంది.

ఇక ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి రెండు సార్లు మీరు ముఖానికి అప్లై చేసినట్లైతే ముఖం మీద వచ్చే మొటిమలు, మచ్చలు దూరం కావడమే కాకుండా ఎండ వల్ల ఏర్పడిన ట్యాన్ కూడా తొలగిపోతుంది. ఇకపోతే వయసు తో సంబంధం లేకుండా వచ్చే మడతల్ని కూడా ఈ ఫేస్ ప్యాక్ దూరం చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఇక ముఖ ఛాయ పెరగడంతో పాటు మృదువుగా చాలా స్మూత్ గా తయారవుతుంది.ఈ చిట్కాను ఇప్పటికే ఎంతోమంది అమ్మాయిలు ఉపయోగించి ఫలితాన్ని కూడా చూశారు. మీరు కూడా అప్లై చేసే మంచి రిజల్ట్ ను పొందవచ్చు.