మునక్కాయ.. మునగ చెట్టు నుంచి లభించే ఈ మునగ ఆకులు, కాయలు, పూలు అన్నీ కూడా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. ఇకపోతే మునగ నూనె కూడా మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. సహజంగా మునక్కాయలో ఉండే గింజలను ఎండబెట్టి వాటి నుంచి నూనె ను తయారుచేస్తారు. ఈ మునగ నూనె వల్ల ఆరోగ్యానికి మంచి చేయడంతో పాటు చర్మం కూడా నిగారింపును సంతరించుకుంటుంది. చర్మ సౌందర్యానికే కాకుండా జుట్టు సమస్యలకు కూడా ఉపయోగపడుతుంది. కాలుష్యం కారణంగా చర్మం పై ఏర్పడిన ట్యాన్ ను తొలగించడంలో ఈ మునగ నూనె చాలా బాగా పనిచేస్తుంది. ఇకపోతే రోజు వారి పనుల వల్ల కలిగే ఒత్తిడి, అలసట వంటి వాటి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
మునగ నూనె ను ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం మృదువుగా మారడమే కాకుండా చాలా ప్రకాశవంతంగా మారుతుంది. పొడిచర్మం కూడా దూరం చేసుకోవచ్చు. పగిలిన పెదాలకు కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. మునగ నూనెలో ఉండే ఫ్యాటీ ఆమ్లాలు, మినరల్స్, విటమిన్స్ చర్మానికి తగినంత తేమను ఇవ్వడంతో పాటు మంచి పోషణను కూడా అందిస్తాయి. ఇక ఇందులో ఉండే విటమిన్-సి కారణంగా కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మం పై ముడతలు రాకుండా కాపాడుతుంది. ముఖం మీద సన్నటి గీతలు, మచ్చలు ఉన్నాసరే ఈ నూనెను ముఖంపై అప్లై చేయడం వల్ల మంచి లాభాలు పొందవచ్చు.

ఉదయం కంటే రాత్రి పడుకునే ముందు ముఖానికి అప్లై చేయడం వల్ల ఇందులో ఉండే విటమిన్ సి అలాగే విటమిన్ ఈ చర్మం పై ఉన్న మొటిమలు, మొటిమల కారణంగా వచ్చిన మచ్చలను , పిగ్మెంటేషన్ సమస్యలను కూడా దూరం చేస్తుంది. ఇక యాంటీఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల చర్మంపై కాలిన గాయాలు , మచ్చలు వంటివి కూడా త్వరగా నయమవుతాయి. జుట్టు తడిగా ఉన్నప్పుడు మునగ నూనె తీసుకుని కుదుళ్ళ లోకి వెళ్లేలా మృదువుగా మర్దనా చేయాలి . ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లు దృఢంగా మారి .. చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.