Omicron : కరోనా రెండు దశలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఒమిక్రాన్ అనే కొత్త వైరస్ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది. ఈ వైరస్ తో ఎవరైతే బాధపడుతున్నారో వారికి శరీరం అంతటా నొప్పులతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నారు. అయితే అందరిలో ఒకే లక్షణాలూ కనిపించలేదు అని, కొంత మందిలో జలుబు, జ్వరం, పొడిదగ్గు ఉంటే మరి కొంతమందికి శరీరమంతా నొప్పులతో కుళ్ళచేసినట్లు ఉందని రకరకాలుగా ఉంటున్నట్లు చెబుతున్నారు. ఒమిక్రాన్ బారినపడిన వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఏదైనా సరే ఒక సమస్యను నివారించాలంటే చికిత్సతో పాటు ఆహారం కూడా అవసరం అనేది ముందుగా మనం గుర్తించాలి . మనం తీసుకునే ఆహారం వల్లే ఒక్కొక్కసారి మనకు వచ్చిన ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. ఒమిక్రాన్ లక్షణాలను తగ్గించడంలో కొన్ని ఆహారాలు బాగా సహాయపడుతాయి. గొంతు నొప్పి ఉన్నప్పుడు గొంతు నొప్పిని తగ్గించే కొన్ని రకాల సూపులు, మింగడానికి కష్టంగా అనిపించినప్పుడు కిచిడి వంటివి మృదువైన ఆహార పదార్థాలను తీసుకోవచ్చు. విటమిన్ సి అధికంగా ఉండే ఆరెంజ్ తో పాటు ఉసిరికాయలను ప్రతిరోజు తినవచ్చు. అలాగే కొబ్బరి నీరు, అరటి పండ్లు ప్రతి రోజు తినడం వల్ల ఈ వైరస్ నుంచి ఉపశమనం దొరుకుతుంది.

ప్రోటీన్ ఆహారం కావాలి అంటే అందుకోసం పాలు, పెరుగు, గుడ్లు, చికెన్ ,చేపలు ,పన్నీర్ పప్పులు లాంటివి తీసుకోవాలి. విటమిన్ సి కోసం నిమ్మ, నారింజ, జామ, ఉసిరి వంటివి తప్పకుండా తినాలి. జింక్ సప్లిమెంట్ కావాలి అంటే గుడ్డు, జీడిపప్పు, పాలకూర, పప్పు ,పాలు సమృద్ధిగా తీసుకోవాలి. మంచి కొవ్వు ల కోసం చేపలు అవిసె గింజలు వాల్ నట్స్ తప్పనిసరి. శరీరాన్ని హైడ్రేట్ స్థితిలో నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే రోజుకు నాలుగు లీటర్ల నీళ్లు తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తిని బలోపేతం అయ్యి వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.