Health Benefits : వేల రోగాలను నయం చేసి తొగరు ఫలం.. ప్రయోజనాలు తెలుసుకోవాల్సిందే..?

Health Benefits : సాధారణంగా ఈ తొగరు ఫలమును చాలా మంది చూసి ఉండరు అంతేకాదు చాలా మందికి ఈ పండు గురించి కూడా అవగాహన ఉండి ఉండదు. కానీ దీనికి సంబంధించిన ఆకులు, పండ్లరసం, కాండం ఇలా ప్రతి ఒక్కటి కూడా ఔషధంగా ఉపయోగించబడతాయి.. ఇకపోతే ఈ పండు సుమారుగా వేలకుపైగా వ్యాధులను నయం చేస్తుందని ఆయుర్వేద శాస్త్రంలో లిఖించబడింది. ఇకపోతే ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ప్రకృతిలో లభించే ప్రతి పండు లేదా మొక్క మనకు చక్కటి ప్రయోజనాలను కలిగిస్తాయి అన్న విషయం అందరికీ తెలిసిందే .. కానీ వీటి వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయం మాత్రం చాలామందికి తెలియదు అని చెప్పాలి ..అందుకే ఏ చిన్న సమస్య వచ్చినా వైద్యులను సంప్రదిస్తూ ఆ సమస్యను నయం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు..

ఇకపోతే ఈ తొగరు ఫలం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయం గురించి ఇప్పుడు చదివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఫలము వల్ల మనకు శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు ఈ పండ్లతో తయారు చేసిన జ్యూస్ లో యాంటీ ఒబేసిటీ లక్షణాలు ఉండటం వల్ల అధిక బరువుతో బాధపడే వారికి అతి తక్కువ రోజుల్లోనే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. ఇక డయాబెటిస్ ఉన్నవారు ఈ పండు రసం తాగడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రణలో ఉండి డయాబెటిస్ సమస్యను అదుపులో ఉంచుతాయి.ఈ తొగరు ఫలం లో బీటా గ్లూకాన్స్ , కంజు గేటెడ్ లినోలెయిక్ యాసిడ్ ఉండడం వల్ల రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ నుంచి మనల్ని కాపాడుతాయి.

Noni fruit that cures thousands of diseases
Noni fruit that cures thousands of diseases

ఇకపోతే ఈ కాయను నోని ఫ్రూట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎలాంటి నేల లో నైనా సరే సమృద్ధిగా ఎదగడమే కాకుండా సంవత్సరం పొడవునా ఫలాలను అందిస్తుంది. ఇక ఈ పండ్లు రుచికి చేదుగా , వగరుగా అనిపిస్తాయి. ఇకపోతే ఈ చెట్టు ఆకులు మనకు కీళ్ల నొప్పులను నయం చేయడంలో సహాయపడతాయి. అలాగే ఇందులో 150కి పైగా పోషకాలు ఈ కాయలలో ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గర్భిణీ స్త్రీలు , పాలిచ్చే తల్లులు ఈ పండు రసం సేవించడం ప్రమాదకరం.. ఒకవేళ తీసుకోవాల్సిన అవసరం వస్థే వైద్యుల సలహా తప్పనిసరి..