Health Tips : సాధారణంగా అమ్మాయి అందం గురించి వివరించాలంటే ఒక రోజంతా సరిపోదనే చెప్పాలి.. ఎందుకంటే అమ్మాయి అందం వివరించడానికి కవులు సైతం ఎక్కువ సమయం తీసుకునే రోజులు ఉన్నాయి. అందుకే అమ్మాయిని ఎప్పుడూ పండ్లతో , పూలతో పోల్చుతూ ఉంటారు మన కవులు. అలాంటి అందమైన ముఖం మీద మచ్చలు కానీ నల్లటి వలయాలు కానీ ఏర్పడ్డాయి అంటే చూడడానికి అందవిహీనంగా కనిపిస్తుంది.. ఈ ప్రపంచాన్ని చూసే కళ్ళు ఎంత అందంగా ఉంటే ఆ అమ్మాయి కూడా అంతే అందంగా కనిపిస్తుంది.. కానీ అదే కళ్ళ కింద నల్లటి వలయాలు వస్తే మాత్రం చూడడానికి అస్సలు బాగోదు.. కళ్ళ కింద నల్లటి వలయాలు పోవాలంటే ఏమి చేయాలో మనం ఇప్పుడు చదివి తెలుసుకుందాం.
ఈ కాలంలో చాలామంది సెల్ ఫోన్, లాప్ టాప్ , టీవీ అంటూ నిద్రపోవడానికి కూడా సమయం కేటాయించలేక పోతున్నారు. అర్ధరాత్రి 1:00 వరకు సెల్ ఫోన్ ని చూసి సమయాన్ని గడిపేస్తున్నారు.. సరిగా నిద్రపోనప్పుడు కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. అందుకే రాత్రి 9 గంటలకు నిద్ర ప్రారంభించి ఉదయం 5 గంటలకు నిద్రలేవాలి అని వైద్యులు సలహా ఇస్తున్నారు. నిద్రకి సమయాన్ని కేటాయించడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం అందానికి అందం లభిస్తుంది.ముఖ్యంగా డార్క్ సర్కిల్స్ కి నిద్ర లేమితో పాటు మరెన్నో కారణాలు కూడా ఉన్నాయి ..

మానసిక ఒత్తిడి, ఎలర్జీ, హార్మోన్ సమస్యలు, డీహైడ్రేషన్ వంటి సమస్యల వల్ల కూడా కంటి కింద వలయాలు ఏర్పడతాయి. అయితే ఇవి దూరం చేసుకోవాలంటే ఇప్పుడు ఒక చక్కని చిట్కాను పాటించండి. పాలలో విటమిన్ ఏ, విటమిన్ బి6 పుష్కలంగా లభించడం వల్ల ముఖానికి అప్లై చేస్తే అందంగా ఆకర్షణీయంగా తయారవుతుంది. కొద్దిగా పాలలో శెనగపిండి వేసుకుని కళ్ళకింద అప్లై చేసి , అరగంటాగి చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. హెర్బల్ టీ ని ఉపయోగించడం, గ్రీన్ టీ ని ఉపయోగించడం కీరదోసకాయ, పసుపు ను కూడా కళ్ళకింద అప్లై చేయడం వల్ల నల్లటి వలయాలు దూరం అవుతాయి.