Vegetables Face Packs : కాయగూరలతో చక్కటి ఫేస్ ప్యాక్స్.. తప్పకుండా తెలుసుకోవాల్సిందే..?

Vegetables Face Packs : ముఖ్యంగా మనకు ప్రకృతిలో లభించే కూరగాయలతో కూడా మన ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకోవచ్చు. వీటి ద్వారా మనకు ఆరోగ్యానికి సంబంధించిన పోషకాలు మాత్రమే కాదు అందానికి అవసరమయ్యే పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి మనకు ప్రకృతి ద్వారా లభ్యమయ్యే కాయగూరలతో ఎలాంటి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..

Advertisement
Nice face packs with vegetables must know
Nice face packs with vegetables must know

1. క్యారెట్ ఫేస్ ప్యాక్ : క్యారెట్ ను తురిమి మెత్తటి పేస్ట్ లా తయారు చేయాలి. ఇప్పుడు దీనికి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, రెండు టేబుల్ స్పూన్ల అరటిపండు గుజ్జు, పావు టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా కలియబెట్టాలి. రెండు నిమిషాలు పక్కన ఉంచి ఆ తర్వాత ముఖానికి ఈవెన్ గా అప్లై చేయాలి. ఇప్పుడు ఇరవై నిమిషాలు పూర్తిగా ఆరిపోయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు సార్లు ఫేస్ ప్యాక్ ను అప్లై చేసినట్లైతే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.

Advertisement

2. టమాటో ఫేస్ ప్యాక్ : ఇందుకోసం మీరు టమోటాలను బాగా గ్రైండ్ చేసి మెత్తని పేస్ట్ లా తయారు చేయాలి. ఇప్పుడు ముఖానికి పూర్తిగా ఈ మిశ్రమాన్ని అప్లై చేసి పది నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడు లేదా నాలుగు సార్లు ఈ టమోటో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు లభిస్తాయి.

3. పుదీనా ఫేస్ ప్యాక్ : పుదీనా ముఖాన్ని కాంతివంతంగా తయారు చేయడమే కాకుండా చర్మం మీద పుట్టే మంట, అలర్జీలను కూడా దూరం చేస్తుంది. ఇది సహజంగా చల్లదనాన్ని కలిగి ఉంటుంది కాబట్టి.. పుదీనా ను పేస్ట్ గా చేసి అందులో కొద్దిగా పసుపు కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖం తెల్లగా అనిపించడమే కాకుండా ముఖం మీద ఉండే మొటిమలు, మచ్చలు కూడా దూరమవుతాయి.

Advertisement