Health Problems : క్యాన్సర్ ఒక తీవ్రమైన భయంకర వ్యాధి అని అందరికీ తెలిసిందే ..అయితే ఈ వ్యాధి గురించి ప్రజలకు తప్పకుండా ఒక అవగాహన కల్పించడానికి అలాగే లక్షణాలను గుర్తించడానికి.. దానిని ఎలా నివారించాలో తెలుసుకోవడానికి కూడా ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 4వ తేదీన జరిగే ఈ కార్యక్రమంలో ప్రజల్లో క్యాన్సర్ కి సంబంధించి అవగాహన కల్పించడం జరుగుతుంది.. అంటే నిన్న క్యాన్సర్ డే కాబట్టి ఈ క్యాన్సర్ కు సంబంధించి పూర్తి అవగాహన ప్రజలలో నింపడం జరిగింది. అంతేకాదు కొన్ని చోట్ల ప్రత్యేకమైన క్యాంపులను ఏర్పాటు చేసి క్యాన్సర్ పై పూర్తి అవగాహన ప్రజల్లో కల్పించడం జరిగింది..ముఖ్యంగా మగవారిలో క్యాన్సర్ వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అనే విషయం గురించి మనం ఎప్పుడూ చదివే తెలుసుకుందాం..
మూత్ర విసర్జనలో ఇబ్బంది కలగడం : కొంతమంది పురుషులలో వయస్సు తో పాటు మూత్ర విసర్జనకు సంబంధించిన సమస్యలు కూడా పెరుగుతాయి.. రాత్రిపూట బాత్రూం కి వెళ్లడం.. కొన్ని కొన్ని సార్లు మూత్ర నియంత్రణ కూడా సాధ్యం కాని స్థితికి చేరుకుంటారు.. మూత్ర విసర్జన సమయంలో రక్తం కారడం , మంటగా అనిపించడం వంటి సమస్యలు తలెత్తుతాయి.. ప్రోస్టేట్ గ్రంధి యొక్క విస్తరణ కారణంగా ఇలాంటి లక్షణాలు మనకు కలుగుతాయి. ఇది ప్రోస్టేట్ క్యాన్సర్ కు దారితీస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి రక్తంతోపాటు ప్రోస్టేట్ పరీక్ష కూడా చేయించుకోవాలి.

శరీర చర్మంలో మార్పులు : చర్మం మీద ఏదైనా మొటిమలు ,మచ్చలు వచ్చినప్పుడు దాని పరిమాణం పెద్దగా అవడం లేదా రంగు మారిపోవడం కొన్నిసార్లు అకస్మాత్తుగా కనిపించకపోవడం ఇలా ఏదైనా మీకు తెలియని లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి చర్మ క్యాన్సర్ సంబంధించిన చికిత్స చేయించుకోవడం చాలా ఉత్తమం.ఇక వీటితో పాటు ఆహారం మింగటంలో ఇబ్బంది, గుండెల్లో మంట, వృషణాలలో మార్పులు, చాతి లో మార్పులు, వేగంగా బరువు తగ్గిపోవడం వంటి లక్షణాల వల్ల కూడా ఒక్కోసారి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి ముందుగానే మీరు గమనించి వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.