Health Benefits : ప్రకృతి ప్రసాదించిన ఆకుకూరలు మాత్రమే కాదు కాయగూరలు కూడా మన ఆరోగ్యాన్ని రెట్టింపు చేస్తాయి అని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే కొన్ని రకాల కాయగూరలు మనం తప్పకుండా తీసుకోవాలి. అలాంటి కాయగూరల్లో సొరకాయ కూడా ఒకటి. ఈ సొరకాయ రుచితో పాటు అనేక పోషకాలను కలిగి ఉంటుంది. ఇక ఆరోగ్యాన్నిచ్చే ఈ సొరకాయను జ్యూస్ రూపంలో తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా సొరకాయ విటమిన్ బి, విటమిన్ సి తోపాటు.. సోడియం, ఐరన్, జింక్, పొటాషియం కలిగి ఉంటుంది. ఇది అధిక మొత్తంలో నీటిశాతాన్ని మరియు తక్కువ కొలెస్ట్రాల్ ను కలిగి ఉంటుంది.
ప్రతిరోజు సొరకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల అనేక అద్భుత ఫలితాలను పొందవచ్చు.సొర కాయ ముక్కల్ని గ్రైండర్లో వేసి మెత్తగా చేసుకోవాలి.. తర్వాత కాస్త ఉప్పు, జీరా పొడి, మిరియాల పొడి, పుదీనా ఆకులు వేసి బాగా మిక్సీ పట్టి పానీయాన్ని తయారు చేసుకోవాలి..సొరకాయలలో నీటిశాతం ఎక్కువగా ఉండడం వల్ల ఈ జ్యూస్ తాగడం వల్ల చర్మాన్ని డీహైడ్రేషన్ బారిన పడకుండా చేస్తుంది. అంతే కాకుండా చర్మానికి కావాల్సిన తేమను కూడా అందించి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.
కంటి చూపు మెరుగు పరిచేందుకు విటమిన్ -A ఇందులో పుష్కలంగా ఉంటుంది. అందుచేతనే కంటిచూపు సమస్యలతో బాధపడే వారు వీటిని తప్పకుండా తీసుకోవడం మంచిది.డయేరియాను నివారించడానికి ఈ సొరకాయ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో నీటి శాతం, మినరల్స్ ఎక్కువ మొత్తంలో కలిగి ఉండడం వల్ల ఈ జ్యూస్ విరోచనాలను నివారించడంతో పాటు.. శరీరంలో కోల్పోయిన ఖనిజాలను భర్తీ చేస్తుంది.ఈ సొరకాయ జ్యూస్ ఈ గుండె ఆరోగ్యాన్ని పెంచేందుకు జింక్ ను కూడా అందిస్తుంది. ఇది శరీరంలో ఉండే రక్తసరఫరాను క్రమబద్దీకరిస్తుంది. అంతేకాకుండా అధికరక్తపోటు సమస్య నుంచి బయటపడేలా చేస్తుంది.
బరువు తగ్గాలనుకునేవారు ఈ పానీయాన్ని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల తేలికగా బరువు తగ్గించుకునేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. మన శరీరంలో ఉండే వ్యర్థాలను బయటికి తేలికగా బయటకు పంపడానికి ఈ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. ఇక సొరకాయను కూర రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇక సొరకాయలను ఎలా తీసుకున్నా సరే దీని ఫలితాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి. అందుకే ఇష్టం లేకపోయినా సరే ఆహారంలో ఒక భాగంగా చేర్చుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.