Liver Problems : శరీరం నుండి వ్యర్థాలను , విషపదార్థాలను బయటకు తొలగించడంలో కాలేయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇక మానవ శరీరం లోని 500 ప్రధాన శరీర విధులకు కారణమని మీకు తెలుసా..? కాబట్టి మన శరీరం ఆరోగ్యంగా పనిచేయాలంటే ముందుగా కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. కాలేయం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి అనే విషయం తెలుసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారాలు తినడం చాలా మంచిది. కాబట్టి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలి.
ద్రాక్ష పండు : ద్రాక్ష పండు లో విటమిన్ ఈ, కాల్షియం, ఫైబర్, విటమిన్ సి , ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇక ఇది దీర్ఘకాలిక మంటను దూరం చేయడంలో సహాయపడతాయి. ముఖ్యంగా ద్రాక్ష పండు లో నారింగేనిన్, నరింగిన్ అని రెండు ప్రధాన యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఇవి హెపాటిక్ ఫైబర్స్ పెరుగుదలను తగ్గిస్తాయి.
బచ్చలికూర : మెంతులు, ఆవాలు, బచ్చలికూర, ఆకుకూరలు ఇవన్నీ కూడా మనకు మంచి పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను చెప్పవచ్చు. ముఖ్యంగా వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ , నైట్రేట్స్ , ఫైబర్ , పొటాషియం అధికంగా లభిస్తాయి. కాలేయ పనితీరును మెరుగుపరిచి ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఆకుకూరల్లో ఉండే క్లోరోఫిల్ కాలేయంలోని విష పదార్థాలను తొలగించి భారీ లోహాలను శుభ్రం చేయడంలో సహాయపడుతుంది.
క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రోకలీ : మనకు ఫైటో న్యూట్రియంట్స్ , కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ వంటివి లభిస్తాయి. వీటివల్ల శరీరంలో విషపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. కాలేయం ఆరోగ్యాన్ని పెంచుతాయి. అందుకే వారానికి ఒకసారి వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమం.
కాఫీ : కాఫీ తాగినప్పుడు ఇందులో ఉండే పాలీఫెనాల్స్ వంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు కాలేయంలో వచ్చే మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఫ్రీరాడికల్స్ తో పోరాడి వాటిని దూరం చేయడంలో కాఫీలో ఉండే పాలీఫెనాల్స్ చాలా చక్కగా సహాయపడుతాయి.వాయితే కాఫీ కేవలం కొద్దిగా తీసుకోవడం మంచిది.వీటితో పాటు బీట్ రూట్, జ్యూస్, నట్స్ ,ధాన్యాలు, వెల్లుల్లి, నీరు , పసుపు తప్పకుండా మన ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి.