kiwi fruit : ప్రస్తుత కాలంలో కరోనా వచ్చి వెళ్లిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంపైన ఎక్కువగా శ్రద్ద చూపిస్తున్నారు .. ఫిట్ గా ఉండేందుకు తాజా పండ్లను తింటున్నారు.. ఈ తాజా పండ్ల నుంచి తీసిన రసాలను మొదలుకొని సలాడ్ ల వరకు ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు అధికంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం గమనార్హం.. ఇక నేటి కాలంలో ఈ కివి పండు బాగా ఆదరణ లోకి వచ్చింది. ఇకపోతే కివి ఫ్రూట్ ను మనం కొన్ని ప్రత్యేకమైన సమయాలలో మాత్రమే తినాలి అని.. అలా తింటే మన శరీరానికి తప్పకుండా లాభాలు కలుగుతాయి అని చెబుతున్నారు.. అది ఏంటో ఇప్పుడు మనం క్షుణ్ణంగా చదివి తెలుసుకుందాం..
కివి పండు లో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి.. ముఖ్యంగా విటమిన్ ఎ , విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి 6 వంటివి ఉండటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇక ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో కివి ఫ్రూట్ తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఎలాంటి సమస్యలైన దూరం అవుతాయి. ప్రతి రోజూ ఉదయం పరగడుపున ఈ కివి ఫ్రూట్ తినడం వల్ల రక్తపోటు నియంత్రించడంతో పాటు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో ప్రభావంతంగా పనిచేస్తాయి.. ఇక గుండెల్లో మంట, గుండె పోటు వంటి సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు.

ఇక మనలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే విటమిన్ సి, విటమిన్ కె తప్పనిసరి .. ఇవి రెండూ మనకు కివి ఫ్రూట్ లో లభిస్తాయి.. కాబట్టి ఖాళీ కడుపుతోనే తినడం వలన రోగనిరోధక శక్తి పెరిగి దగ్గు , జలుబు వంటి వ్యాధులను నివారించవచ్చు. ఇక ప్రతి రోజూ ఉదయం తినడం వల్ల అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చు.. పరగడుపున తినడం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయదు కాబట్టి బరువు తగ్గే అవకాశాలు ఎక్కువ. విటమిన్స్ , మినరల్స్ ఉండడంవల్ల కడుపు నొప్పి, అలర్జీలు ,కిడ్నీ సంబంధిత సమస్యలు అన్ని దూరం అవుతాయి.