Health : మధ్యాహ్నం నిద్ర మంచిదేనా..?

Health : సాధారణంగా చాలామంది వర్క్ ఫ్రం హోం పేరిట కరోనా వచ్చిన తర్వాత ఇంటి నుంచి ఉద్యోగం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోని చాలామంది త్వరగా తమ పనులను ముగించుకుని మధ్యాహ్నం పూట భోజనం చేసిన తర్వాత కాస్త నిద్ర రాగానే కునుకు తీస్తున్నారు.. భోజనం చేసిన తర్వాత కాసేపు నిద్ర ఆరోగ్యానికి మంచిది అని అనుకుంటూ అలా నిద్ర పోవడం గమనార్హం. ఇకపోతే భోజనం తిన్న గంట తర్వాత పడుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.. కానీ మరికొంతమంది భోజనం చేసిన వెంటనే నిద్ర పోతూ ఉంటారు కదా..అలా ప్రతి రోజు మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే నిద్ర పోయే వారికి వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే నిద్ర పోవడం అనారోగ్యానికి దారి తీస్తుందట.. తిన్న వెంటనే నిద్ర పోవడం వల్ల సరిగా జీర్ణం అవ్వక.. కడుపులో కొద్దిగా జీర్ణరసాలు ఉత్పత్తి అవుతాయి. ఈ జీర్ణరసాలు గురుత్వాకర్షణ శక్తి కారణంగా ఆహారం వైపు ప్రయాణం చేసి ఫలితంగా గొంతులో మంటను పుట్టిస్తాయి . ఇక తిన్న వెంటనే నిద్ర పోవడం వల్ల బరువు మొత్తం జీర్ణాశయం పై పడి ఆహారం సరిగా జీర్ణం కాదు.. అంతేకాదు ఆహారపు భారం జీర్ణాశయం పై పడి గురక వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి భోజనం చేసిన అరగంట తర్వాత నిద్ర పోవడం ఆరోగ్యానికి మంచిది.

Is afternoon sleep good for health
Is afternoon sleep good for health

గ్రీస్ లోని యూనివర్సిటీ ఐయోనిన మెడికల్ స్కూల్ లో జరిపిన ఒక అధ్యయనంలో భోజనం తిన్న వెంటనే నిద్రపోతే హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుందట. కాబట్టి వీలైనంత వరకు భోజనం చేసిన వెంటనే నిద్ర పోకుండా మధ్యాహ్నం పూట భోజనం చేసిన అరగంట తర్వాత కేవలం 45 నిమిషాల పాటు మాత్రమే నిద్ర పోవాలి అని వైద్యులు సూచిస్తున్నారు. ఇకపై మీరు కూడా అలా చేస్తూ ఉంటే ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.మధ్యాహ్నం నిద్ర మంచిదేనా..?